Satyabhama Collections: ‘సత్యభామ’ ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

కాజల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యభామ’  (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ‘గూఢచారి’ (Goodachari) , ‘మేజర్’ (Major) చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) సమర్పకులుగా వ్యవహరించారు. అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ‘అవురమ్ ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.

కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు, మూడో రోజు కూడా అంతే.! ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.30 cr
సీడెడ్ 0.12 cr
ఆంధ్ర(టోటల్) 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.11 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.78 cr

‘సత్యభామ’ చిత్రానికి రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ఈ సినిమా రూ.0.78 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.2.92 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus