Satyabhama Trailer Review: యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసింది కాజల్.. ట్రైలర్ ఎలా ఉందంటే?

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో ‘సత్యభామ’ (Satyabhama) అనే సినిమా రూపొందింది. నవీన్ చంద్ర (Naveen Chandra) కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘అవురమ్ ఆర్ట్స్’ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. సుమన్ చిక్కాల (Suman Chikkala) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘మేజర్’ దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందింది. టీజర్, పాటలు ఓకే అనిపించాయి. కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 7న రిలీజ్ కాబోతోంది.

ఈ క్రమంలో ప్రమోషన్స్ డోస్ ను పెంచిన చిత్ర బృందం.. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగి ఉంది. డాక్టర్ అయినటువంటి ఓ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి చంపడానికి ప్రయత్నించడం. ఆమెను కాపాడే క్రమంలో సత్య చేతిలో ఆ అమ్మాయి ప్రాణం పోవడం.. దీంతో సత్య ఉద్యోగం పోవడం జరుగుతాయి.

అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే విషయాలను జాబ్ లేకపోయినా దర్యాప్తు చేసి హంతకుడిని చట్టానికి సత్య ఎలా పట్టించింది. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో గట్టిగానే ఉంటాయనిపిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ తో మెప్పించిన కాజల్..ఇప్పుడు విజయశాంతిలా యాక్షన్ మోడ్ లోకి మారిపోయి తన బెస్ట్ ఇచ్చినట్టు ట్రైలర్ చెబుతుంది. కాజల్ ఆటిట్యూడ్ కూడా బాగుంది. మీరు కూడా ట్రైలర్ ను ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags