యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా, మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో, ఎం.ఎం. కీరవాణి సంగీత సారథ్యంలో, చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం సవ్యసాచి. ఈ సినిమా ఇటీవలే నవంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన ఈ సినిమా కలెక్షన్లు ఆశించినంతగా రాలేదనే చెప్పవచ్చు.
నవంబర్ 2 న రిలీజ్ అయినా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో షేర్ 6. 30కోట్లు వచ్చాయి. రిలీజ్ మొదటి రోజు మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ మూడు రోజుల్లో బానే కలెక్షన్స్ వస్తాయి అనుకున్న ఆశించినంతగా కలెక్షన్లు అనేవి రాలేదు. ఇక దీపావళి పండుగ సెలవుల్లో మంచి వసూళ్లు రాబడుతుందనే ఆశతో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఏరియా                                        కలక్షన్స్
నైజాం                                        216లక్షలు
సీడెడ్                                        110 లక్షలు
నెల్లూరు                                     28లక్షలు
గుంటూరు                                  70లక్షలు
కృష్ణా                                        47 లక్షలు
పశ్చిమ గోదావరి                         33 లక్షలు
తూర్పు గోదావరి                         34లక్షలు
ఉత్తరాంధ్ర                                   92 లక్షలు
మొత్తం మూడు రోజులకుగాను షేర్ 6. 30కోట్లు