నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సవ్యసాచి” టీజర్ ఇవాళ విడుదలైంది. టీజర్ విడుదల తర్వాత నిన్నమొన్నటివరకు సినిమా కాన్సెప్ట్ మీద ఉన్న స్పెక్యులేషన్స్ అన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. అందరూ ముందే ఊహించినట్లు ఈ చిత్రంలో నాగచైతన్య రెండు చేతులకీ సమానమైన బలం ఉండడమే కాదు.. టీజర్ ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే “వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్” అనే ఒక మెడికల్ టెర్మనాలజీని వాడారు.
“మాములుగా ఒక తల్లి రక్తం పంచుకొని పుడితే అన్నదమ్ములు అంటారు.. అదే ఒకే రక్తం… ఒకే శరీరం పంచుకొని పుడితే దాన్ని అద్భుతం అంటారు.. వరసకి కనిపించని అన్నని కడదాకా ఉండే కవచాన్ని ఈ సవ్యసాచి లో సగాన్ని” అని నాగచైతన్య చెప్పిన డైలాగ్ లోని మర్మం చాలామందికి సరిగా బోధపడలేదు. ఇంతకీ ఈ సగానికి అర్ధం ఏమిటి? ఆ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ పరమార్ధం ఏమిటి? అంటే.. తల్లి గర్భంలో అల్ట్రా సౌండ్ టెక్నాలజీ ద్వారా రెండు పిండాలు (ట్విన్స్) ఉన్నారు గుర్తించిన తర్వాత కొన్నాళ్ళకి గర్భస్రావం లేదా మరేదైనా కారణం చేత ఒక పిండం (బిడ్డ) మరణించగా.. మరణించిన పిండం కూడా మొదటి పిండంలో కలిసిపోతుంది.
ఈ తరహా సమస్యను మొట్టమొదట 1945లో వెలుగులోకి వచ్చింది. “సవ్యసాచి”లో నాగచైతన్య కూడా ఈ తరహా రుగ్మతి కారణంగా జన్మించేవాడే. సొ, టీజర్ తోనే ఈస్థాయి ఇంట్రెస్ట్ & బజ్ క్రియేట్ చేయగలిగింది అంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే.. టీజర్ చివర్లో మాధవన్ స్పెషల్ ఎంట్రీ కూడా మంచి ప్లస్ పాయింట్ అయ్యింది.