పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. అందువల్ల అతని సినిమాలు కంప్లీట్ చేయలేని పరిస్థితిలో ఇన్నాళ్లు ఉంటూ వచ్చారు. అయితే తన నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు గమనించి.. డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా టీం వెల్లడించడం జరిగింది. మరోపక్క ‘ఓజి’ (OG Movie) కోసం కూడా రంగంలోకి దిగనున్నారు.
సుజీత్ Sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘ఓజి’ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం కూడా పవన్ కు బాగా తెలుసు. మరోపక్క హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.
‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు మొదలైంది. కానీ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) గా టైటిల్ మార్చారు. ఆల్రెడీ స్క్రిప్ట్ మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలక పదవుల్లో బాధ్యతలు స్వీకరించడం వల్ల మళ్ళీ స్క్రిప్ట్ మార్చమని దర్శకుడు హరీష్ శంకర్ ను కోరారట. జూలై చివరి వారం నుండి డేట్స్ ఇస్తానని కూడా భరోసా ఇచ్చారట. దీంతో హరీష్ ఆ పనుల్లో ఉన్నారు.