Tollywood: సముద్రం చుట్టూరా మన స్టార్‌ హీరోల కథలు… కొత్తగా మరో మూడు!

సముద్రం… ఇప్పుడు టాలీవుడ్‌కి చాలా అవసరం. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న స్టార్‌ హీరోలు సముద్రం మీదే మనసు పడ్డారు అనిపిస్తోంది. కావాలంటే చూడండి ఒక్కొక్కరి సముద్రం నేపథ్య కథలనే ఎంచుకుంటున్నారు. ఆ లెక్కన టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు సముద్రం మీదనే సినిమాలు చేస్తున్నారు. దీంతో టాలీవుడ్‌కి సముద్రం హిట్ సెంటిమెంట్‌గా మారిపోయింది… ఇంకా చెప్పాలంటే బ్లాక్‌బస్టర్‌ సెంటిమెంట్‌గా మారిపోయింది అని చెప్పొచ్చు. కావాలంటే ఈ దిగువ లిస్ట్‌ మీరే చూడండి.

యువ కథానాయకుడు నాగచైతన్య ఇటీవల ‘తండేల్‌’ అనే సినిమాను అనౌన్స్‌ చేశాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాలో గంగపుత్రుల కథను చూపించబోతున్నాడు. సినిమా చాలా వరకు సముద్రం నేపథ్యంలోనే సాగుతుంది. ఇక రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందనున్న సినిమా నేపథ్యం కూడా సముద్రమే అంటున్నారు. సముద్రపు ఒడ్డున ఉండే ఓ గ్రామంలో జరిగే కథ ఇది అని టాక్‌.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) – సుజీత్‌ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా కథ ముంబయి, సముద్రం చుట్టూనే తిరుగుతుందట. ఈ మేరకు ఆయా సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది అని సమాచారం. ఇక తారక్‌ – కొరటాల శివ సినిమా ‘దేవర’ కూడా ఓ దీవి నేపథ్యంలో ఉంటుంది. అంటే సముద్రమే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లలో సముద్రం ఆనవాళ్లు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన స్టార్‌ హీరోలు నలుగురు ఇప్పుడు సముద్రం మీదనే ఉన్నారు అని చెప్పాలి.

ఇక రీసెంట్‌గా చూస్తే చిరంజీవి – రవితేజ – బాబి ‘వాల్తేరు వీరయ్య’ కూడా సముద్ర నేపథ్యంలో తెరకెక్కిందే. అంతకుముందు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ‘ఉప్పెన’, ‘రంగస్థలం’ సినిమాలు కూడా సముద్ర నేపథ్యమే. ఆయాన సినిమాలు ఎంతటి విజయం సాధించాయో మీకు తెలిసిందే. మరి ఇప్పుడు సిద్ధమవుతున్న సినిమాలు ఇంకెలాంటి విజయం అందుకుంటాయో చూడాలి. విజయం కొనసాగితే ఇలాంటి కథలూ కొనసాగుతాయి. ఇంకొందరు హీరోలు సముద్రయానం మొదలుపెడతారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus