RRR Movie Song: ‘ఆర్ఆర్ఆర్’.. బిట్లు బిట్లుగా ‘దోస్తీ’ సాంగ్..?

నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుండి ‘దోస్తీ’ సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ ఒక్క పాత కోసమే సుమారు మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ థీమ్ సాంగ్ చివర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కనిపించి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచారు. అయితే ‘దోస్తీ’ పాటకు ఇది ఒక వెర్షన్ మాత్రమే అని సమాచారం. ఈ పాటకు రెండు వెర్షన్ కూడా ఉందట.

దాన్ని మాత్రం సినిమాలోనే చూడాలట. ఈ ‘దోస్తీ’ పాటలో మాత్రం చిత్రబృందం అంతా కనిపిస్తుంది. రాజమౌళి, సెంథిల్, అలియా భట్ ఇలా సినిమా కోసం పని చేసిన నటీనటులను టెక్నీషియన్స్ ను ఈ పాటలో చూపించబోతున్నారు. సినిమా మొత్తం ‘దోస్తీ’ పాట బిట్లు బిట్లుగా వినిపిస్తుందట. చివర్లో మాత్రం ఎండ్ టైటిల్స్ లో చిత్రబృందం అంతా ఈ పాటలో కనిపించి కనువిందు చేయబోతుంది. ఈ సినిమాలో మిగిలిన పాటల లిరికల్ వీడియోలు సైతం ఇలానే కొత్తగా ఆలోచించి.. డిజైన్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.

దాని కోసం స్పెషల్ గా బడ్జెట్ కూడా కేటాయించారట. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. థర్డ్ వేవ్ లేకుండా ఏపీలో థియేటర్ టికెట్ రేట్ల విషయంలో ఓ కొలిక్కి వస్తే సినిమా అనుకున్న సమయానికి రావడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus