Ram Pothineni: రామ్ సినిమాకి సెకండ్ హీరో సమస్య.. ఇప్పట్లో తీరదా?

రామ్ (Ram)  ‘మైత్రి మూవీ మేకర్స్’ లో ఒక సినిమా చేస్తున్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ మహేష్ బాబు.పి  (Mahesh Babu P)  ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే 5 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి అని వినికిడి. గోదావరి బ్యాక్ డ్రాప్లో.. సినిమా చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం. సినిమా కథ ప్రకారం… ఒక సీనియర్ హీరోకి కూడా ఛాన్స్ ఉంటుందట. దాని కోసం ఇప్పటికే బాలకృష్ణ (Nandamuri Balakrishna), రజినీకాంత్  (Rajinikanth), మోహన్ లాల్ (Mohanlal) , అరవింద్ స్వామి (Arvind Swamy) .. వంటి వాళ్ళను సంప్రదించారు.

Ram Pothineni

కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల ఉపేంద్రని అప్రోచ్ అయ్యారట. కానీ అతను ఏ విషయం కన్ఫర్మ్ చేయకపోవడంతో .. విజయ్ సేతుపతిని సంప్రదించారట నిర్మాతలు. ఇదే నిర్మాతలతో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గతంలో ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమా చేశాడు. అందువల్ల రామ్ సినిమాలో నటించడానికి అతను ఈజీగా ఒప్పేసుకుంటాడులే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి నెగిటివ్ రోల్స్ కి, విలన్ రోల్స్ కి..అలాగే సహాయ నటుడు పాత్రలు వంటి వాటికి కొంత బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నాడట.

హీరోగానే సినిమాలు చేసి మార్కెట్ పెంచుకోవాలి అనేది విజయ్ సేతుపతి తాపత్రయం. ‘మహారాజ’ (Maharaja) పెద్ద హిట్ అయ్యింది. ‘విడుదలై 2’ (Vidudala Part 2)  కూడా పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. అందుకే రామ్ సినిమాకి అతను నో చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మేకర్స్ మళ్ళీ ఉపేంద్రని (Upendra Rao) కన్విన్స్ చేసే పనిలో పడ్డారట.

రవితేజ ఎందుకు దేవిని వద్దన్నాడు…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus