త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగు హిట్ డైరక్టర్లో ఒకరు. మెగాఫోన్ పట్టక ముందు.. మాటల రాతకారి. సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందు ట్యూషన్ మాస్టర్. గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకున్నా రంగుల లోకంలో రచయితగా, దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్న ఆయన వ్యక్తిగత జీవితంలో దాగిన కొన్నినిజాలు..
1. త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. అతని స్వస్థలం భీమవరం.2. నంబర్ వన్ స్టూడెంట్ త్రివిక్రమ్. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ పూర్తి చేసారు. గోల్డ్ మెడల్ అందుకున్నారు.3. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖుల పరిచయం ఏర్పడాలని త్రివిక్రమ్ ట్యూషన్ మాస్టర్ గా మారారు. హాస్య నటుడు గౌతం రాజు పిల్లలకు ట్యూషన్ చెప్పారు.4. ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి వద్ద మాటల మాంత్రికుడు నాలుగు ఏళ్ల పాటు సహా రచయితగా పని చేశారు.5. అద్భుత పాటలు రాసిన గేయ రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రి తమ్ముడి కుమార్తె సౌజన్యను త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.6. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “తీన్మార్”, మాస్ మహా రాజ్ “ఒక రాజు ఒక రాణి” సినిమాలో త్రివిక్రమ్ పాటలు రాశారు.7. త్రివిక్రమ్ పాటలు రాయడమే కాదు .. పాడారు. తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా “నువ్వే నువ్వే”లో “కంప్యూటర్స్ ఆర్ట్సు సైన్సు” అనే పాటను ఆలపించారు.8. త్రివిక్రమ్ మాటలు రాసిన చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, అతడు సినిమాలకు బెస్ట్ రైటర్ గా నంది అవార్డ్ లు సొంతం చేసుకున్నారు. బెస్ట్ డైరక్టర్ గా రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు.9. హీరోగా ఎదిగిన హాస్య నటుడు సునీల్, త్రివిక్రమ్ రూం మేట్స్. సినిమాల్లో అవకాశాల కోసం తిరిగేటప్పుడు కలిసి ఉండేవారు. ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వీరిద్దరీ పెళ్లి ఒకే రోజు జరగడం విశేషం.10. త్రివిక్రమ్ గొప్ప సినిమాలనే కాదు.. యాడ్స్ ని కూడా తీశారు. రామ్ చరణ్, మహేంద్ర సింగ్ ధోని లతో పెప్సీ ప్రకటనను తీశారు. మహేష్ బాబు నటించిన జోస్ అలూక్కాస్ యాడ్ క్లాస్ గా ఆకట్టుకుంది. సెల్ కాన్ మొబైల్( తమన్నా, విరాట్ కోహ్లి), నవరత్న తైలం(జూనియర్ ఎన్టీఆర్) ప్రకటనలను కూడా త్రివిక్రమే డైరక్ట్ చేశారు.