ప్రస్తుతం దేశంలో పలు చోట్ల రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు పది వేల కేసులు నమోదయ్యాయని అంచనా వేస్తున్నారు. ఇందులో బీజేపీ కేంద్ర పాలిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం నమోదు చేసినవి భారీ సంఖ్యలో ఉన్నాయి. రాజద్రోగ్రామ్ కేసులు సంగతి తేల్చేస్తామని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటిపై రాజద్రోహం కేసు నమోదు కావడం చర్చలకు దారి తీస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ కు చెందిన చిత్ర నిర్మాత,
డైరెక్టర్, మోడల్, నటి అయిన అయిషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు సి అబ్దుల్ ఖదీర్ హాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయిషా సుల్తానాపై పోలీసులు కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మలయాళంలో టీవీ ఛానెల్ లో చర్చల్లో పాల్గొన్న అయిషా మాట్లాడుతూ.. లక్షద్వీప్ కొత్త లెఫ్టనెంట్ గవర్నర్ ప్రఫుల్ పటేల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అతడిని సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన జీవాయుధం అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
ఆయన రాక ముందు వరకు దీవిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని.. ఇప్పుడు రోజుకి వంద కేసులు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలను కూడా అయిషా ఖండించింది. దీంతో ఆమెపై రాజద్రోహం కేసు నమోదు చేశారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!