Sehari Trailer: ట్విస్ట్ తో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ!

హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి నటించిన క్రేజీ రోమ్-కామ్ చిత్రం సెహరి మొత్తానికి థియేట్రికల్ గా విడుదలకు సిద్ధమవుతోంది. జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా విడుదలకు సిద్దం అవుతుండగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ తోనే ఈ సినిమా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తోంది.

ట్రైలర్ లో హర్ష్ కనుమిల్లి తన సోల్ మేట్ కోసం వెతికే క్రమంలో విభిన్నమైన అనుభవాలను ఎదుర్కొంటున్నట్లుగా అర్ధమవుతోంది. అతను కలిసే అమ్మాయిలందరినీ తన లవర్ గా ఫీల్ అయ్యే అతను తన అమాయకత్వం కారణంగా విడిపోతుంటారు. చివరగా తన ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న సిమ్రాన్ చౌదరిని కలుస్తాడు. ఇక ఇంతలో ఇంట్లో వాళ్ళు పెళ్లికి సిద్ధం చేస్తారు. అయితే, కథలో ట్విస్ట్ ఏమిటంటే.. ఆమె తన కాబోయే భార్యకు అక్కగా ఉంటుంది. అతని కంటే నాలుగేళ్లు పెద్దది.

జ్ఞానసాగర్ ద్వారక అన్ని వర్గాలకు నచ్చేలా ఈ సినిమాను సరైన ఎలిమెంట్స్‌తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకునే కథను ఎంచుకున్నారు. హీరో పాత్రతో పాటు మ్యూజిక్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు సమాచారం. హర్ష్ కనుమిల్లి తన అమాయకమైన నటనతో హైలెట్ అవుతున్నాడు. పాత్ర అతనికి తగినట్లుగా కనిపిస్తుంది. ఇందులో నందు ప్రత్యేక పాత్రలో కనిపించాడు. హర్ష్ తండ్రిగా సంగీత దర్శకుడు కోటి నటించగా..

ఇందులో అభినవ్ గోమతం అతని స్నేహితుడిగా నవ్వించే కామెడీ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు. హర్ష కనుమిల్లి ఈ చిత్రానికి రచయిత కూడా. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఇక సెహరి సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus