Sekhar Kammula: ఈసారి స్టార్ హీరోని ‘లీడర్’ ను చేయబోతున్న శేఖర్ కమ్ముల..!

టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్లలో శేఖర్‌ కమ్ముల శైలి వేరు. ఆయన సినిమాలు రొటీన్ గా సాగవు. ఆయన సినిమాల్లో పాత్రలకు బిల్డప్ లు ఉండవు. కానీ మనల్ని చూస్తున్నంత సేపు కట్టిపడేస్తాయి. తర్వాత చాలా రోజులు మనతో ఆ సినిమాలు ట్రావెల్ చేస్తాయి. గతేడాది ‘లవ్‌ స్టోరీ’ తో హిట్టు కొట్టిన శేఖర్ కమ్ముల… ఇప్పుడు ధనుష్ తో ఓ బై లింగ్యువల్ మూవీని చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. మరో పక్క ధనుష్ కూడా తాను కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేయాల్సి ఉంది.

ఈ క్రమంలో శేఖర్ కమ్ముల మరో స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు. అదే ‘లీడర్ 2 ‘. ఆల్రెడీ రానాకి కొన్ని సన్నివేశాలు చెప్పాడు. కానీ రానా ఈ ప్రాజెక్టు పై ఇంట్రెస్ట్ చూపించడం లేదని వినికిడి. ‘లీడర్’ మూవీ రానాతో చేసాడు. అది ఓ క్లాసిక్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ తీయబోతున్నట్లు శేఖర్ కమ్ముల ఎప్పుడో ప్రకటించాడు. ‘అరణ్య’ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ‘శేఖర్ కమ్ముల ‘లీడర్2′ గురించి రెండు మూడు సీన్లు చెబుతారు తర్వాత కనబడరు’ అంటూ ‘భీమ్లా నాయక్’ ప్రమోషన్లలో రానా కూడా చెప్పుకొచ్చారు.

అయితే రానా ప్లేస్ లో ఇప్పుడు సూర్యని అనుకుంటున్నాడట శేఖర్ కమ్ముల. ఈ వార్త గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది. అర్జున్ ప్రసాద్ రోల్ కు రానా జీవం పోసాడు. అతని పాత్రలో మరెవరినీ ఊహించుకోలేము అన్నంతగా ఆ పాత్రకి కరెక్ట్ గా సెట్ అయ్యాడు రానా. కానీ ఇప్పుడు సూర్య పేరు ఎందుకు తెరపైకి వచ్చింది. సూర్య కూడా ఎలాంటి పాత్రనైనా చాలా ఈజ్ తో చేయగలడు. అతన్ని తీసిపారేయలేము.శేఖర్ కమ్ముల ఒకవేళ మార్కెట్ పరంగా ఆలోచింది సూర్యని అనుకుంటున్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ అర్జున్ ప్రసాద్ అంటే రానాని తప్ప ఇంకొకరిని ప్రేక్షకులు ఊహించుకోవడం కష్టం.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus