ఫిదా ఇచ్చిన విజయంతో మరో కథ రెడీ చేస్తున్న శేఖర్ కమ్ముల
- August 17, 2017 / 08:30 AM ISTByFilmy Focus
డైరక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా మూవీతో తానేమిటో మరోసారి నిరూపించుకున్నారు. చక్కని ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించి మంచి విజయాన్ని అందుకున్నారు. వరుణ్ తేజ్, సాయి పల్లవిల నటన సినిమాకి భారీ కలక్షన్స్ తెచ్చి పెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి కలక్షన్స్ సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓవర్ సీస్ లో రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసి రకార్డ్ సృష్టించింది.
ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన 7వ తెలుగు సినిమాగా ‘ఫిదా’ నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో శేఖర్ కమ్ముల మరో కథను సిద్ధం చేస్తున్నారు. అది కూడా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలోనే ఉండబోతుందని సమాచారం. అయితే ఫిదా కి సీక్వెల్ మాత్రం కాదని ముందుగానే స్పష్టం చేశారు. ఆ కథని కూడా దిల్ రాజే నిర్మించనున్నట్లు టాక్. మరి హీరో హీరోయిన్స్ ఎవరు ఉంటారో .. కథ పూర్తి అయిన తర్వాత తెలుస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













