ఆగష్టు నుంచి శేఖర్ కమ్ముల-వరుణ్ చిత్రం..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగష్టు మొదటి వారం నుంచి చిత్రీకరణ జరుపుకునుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తి కావచ్చాయని, ఈ చిత్రంలో వరుణ్ సరికొత్తగా కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ఓ ఎన్నారై యువకుడిగా కనిపించనుండగా.. వరుణ్ సరసన తెలంగాణ యువతి పాత్రలో సాయి పల్లవి కనిపించనుందని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus