ఒకప్పుడు ఏదైనా సినిమాలో పాటలు రావడం అంటే.. ఆడియో రిలీజ్. క్యాసెట్లు, సీడీల తరం అయిపోవడంతో ఇప్పుడు అంతా సింగిల్స్ మీదే సాగుతోంది. అంటే ఓ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసి.. ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది కూడా పాతబడుతోంది. సినిమా ప్రచారం అంతా హుక్ స్టెప్ మీదే సాగుతోంది. ఆ స్టెప్ వీడియోలు, రీల్స్.. ఇలా వరుస కడుతున్నాయి. అలాంటి హుక్ స్టెప్‌ల గురించి స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు.
పాటల్లో కచ్చితంగా హుక్ స్టెప్ ఉండేలా చూస్తున్నారు.. కారణమేంటి మాస్టర్ అని అడిగితే.. ఫుల్ డిటైల్స్ చెప్పారాయన. ఇప్పుడు అందరిచేతిలో మొబైల్ ఉంది. రీల్స్, షార్ట్స్ వీడియోస్ ఎక్కువైపోయాయి. పాట హిట్టయ్యిందా లేదా అనేది తర్వాత రీల్స్‌లో వచ్చే మూమెంట్ ఆకట్టుకుంటే చాలు అనేలా పరిస్థితి ఉంది. ఎంత ఎక్కువమంది ఆ పాటను రీమిక్స్ చేసి రీల్స్ చేస్తే.. అంతగా జనాల్లోకి వెళ్తుంది. అందుకే సిగ్నేచర్ స్టెప్స్‌కు ఆదరణ పెరిగింది అని చెప్పారు.
ఇక నా విషయానికొస్తే నేను మొదటి నుండీ ఈ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నాను. అందుకే నా పాటల్లో కచ్చితంగా సిగ్నేచర్ స్టెప్ పెడుతుంటాను అని చెప్పారు శేఖర్ మాస్టర్. సంక్రాంతికి వస్తున్న రెండు పెద్ద సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’లో శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్‌లు ఇచ్చారు. ‘వాల్తేరు వీరయ్య’లో మొత్తం అన్ని పాటలకు, ‘వీర సింహారెడ్డి’లో ‘సుగుణ సుందరి…’, ‘మా బావ మనోభావాలు..’ గీతాలకు పని చేశారు.
ఇప్పటికే ఆ పాటలకు సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. అందులో సిగ్నేచర్ స్టెప్‌లు కూడా ఉన్నాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. గతంలోనూ మాస్టర్ ఇలాంటి చాలా సిగ్నేచర్ స్టెప్పులు హీరోలతో వేయించారు కూడా. మరి వాటిని పెద్ద తెర మీద చూసి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఉర్రూగిపోతారో చూడాలి. ‘బాస్ పార్టీ’, ‘సుగుణ సుందరి’ హుక్‌స్టెప్‌లు రీసెంట్ టైమ్స్‌లో మంచి హిట్ కదా.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?