యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘శేఖర్’. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న విడుదల కాబోతుంది.
టీజర్, ట్రైలర్లు పర్వాలేదనా బిజినెస్ ఆశించిన స్థాయిలో అయితే జరగలేదు. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.50 cr |
ఉత్తరాంధ్ర | 0.60 cr |
ఈస్ట్ | 0.15 cr |
వెస్ట్ | 0.12 cr |
గుంటూరు | 0.20 cr |
కృష్ణా | 0.13 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.10 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ | 0.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.25 cr |
‘శేఖర్’ చిత్రానికి కేవలం రూ.3.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగింది. చాలా ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 300కి పైగా థియేటర్లలో విడుదలవుతుంది. పాజిటివ్ టాక్ వస్తే స్క్రీన్స్ పెంచే అవకాశం ఉంటుంది. అయితే రాజశేఖర్ సినిమా ఈ టార్గెట్ ను ఛేదిస్తుందా లేదా అన్నది చూడాలి…!
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!