సీనియర్ నటుడు నరేష్ అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా గడుపుతున్నాడు. 1972వ సంవత్సరంలో వచ్చిన ‘పండంటి కాపురం’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నరేష్. అటు తర్వాత 1982 వ సంవత్సరంలో ఆయన తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ సంకెళ్ళు’ తో హీరోగా కూడా మారాడు. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
కానీ 1991 వ సంవత్సరంలో పి.ఎన్.రామచంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిత్రం భళారే చిత్రం’ ఇతనికి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ కాల్ షీట్లు ఖాళీ లేక వదులుకున్న కామెడీ సినిమాలని చేసి ఇతను కామెడీ హీరోగా నిలబడ్డాడు. ఆ టైములో చేసిన ‘జంబలకిడి పంబ’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచి నరేష్ పారితోషికం పెరిగేలా చేశాయి. ఇక ప్రస్తుతం ఆయన సహ నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క పవిత్రతో సహజీవనం చేస్తూ ఇతను ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.
ఇదిలా ఉండగా.. చాలా మందికి ఇతని ముగ్గురు భార్యల గురించి తెలిసుండదు. నరేష్ మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన అబ్బాయి నవీన్. ఆల్రెడీ రెండు, మూడు సినిమాల్లో కూడా హీరోగా నటించాడు.ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ తో ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కించాడు. అయితే నవీన్ పుట్టిన తర్వాత తన మొదటి భార్యతో మనస్ఫర్ధలు రావడంతో విడిపోయాడు నరేష్. తర్వాత రేఖ సుప్రియని రెండో పెళ్ళి చేసుకున్నా అది కూడా నిలబడలేదు.రెండో పెళ్ళి కూడా విడాకుల బాట పట్టింది.వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అటు తర్వాత నరేష్ (Naresh) రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకునే టైంకి నరేష్ వయసు 50 ఏళ్ళ. రమ్య రఘుపతి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె. 2010 వ సంవత్సరం డిసెంబరు 3 న హిందూపురంలో వీరి పెళ్లి జరిగింది. వీరికి కూడా ఓ బాబు ఉన్నాడు అని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెట్టి.. నరేష్ ముగ్గురి భార్యలను, పిల్లల పిక్స్ ను ఓ లుక్కేయండి :