Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్ ను కెలికిన సీనియర్ నటుడు..!

అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ ను చేసిన మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం నార్త్ లో రూ.108 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక పార్ట్ 2 ‘పుష్ప ది రూల్‌’ పేరుతో రిలీజ్ కాబోతుంది.

పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 ని ఏమాత్రం రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రూ.400 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప ది రూల్’ చిత్రం ఫుల్ రన్లో రూ.170 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.350 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నార్త్ జనాల్లోకి పుష్ప మేనరిజమ్స్ విపరీతంగా వెళ్లిపోయాయి. క్రికెటర్లు కూడా ‘శ్రీవల్లి’ పాటలోని స్టెప్స్ వేస్తూ ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా నిలిచారు.

అయితే ఈ చిత్రం కేవలం సమంత వల్లే హిట్ అయ్యింది అంటున్నారు సీనియర్ నటుడు భానుచందర్. ఈ చిత్రంలో ‘ఉ అంటావా ఉఊ అంటావా’ పాటలో నర్తించింది సమంత. ఇండియా వైడ్ ఈ పాట ట్రెండింగ్లో నిలిచింది. ఇక ఈ చిత్రం గురించి భానుచందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “బాలీవుడ్ సినిమాలను మన సౌత్ సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. సౌత్ నుంచి పాన్ ఇండియా మూవీస్ అంటూ విడుదలవుతున్న సినిమాలు అక్కడ ఘన విజయం సాధిస్తున్నాయి.

అంతెందుకు రీసెంట్‌గా విడుద‌లైన ‘పుష్ప’ సినిమా ఎంత సెన్సేషన్ చేసింది. ముఖ్యంగా స‌మంత న‌టించిన ‘ఉ అంటావా మావ‌’…సాంగ్ వ‌ల్ల‌నే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. ఆ పాట అన్ని లాంగ్వేజెస్‌లో మారు మోగింది” అంటూ చెప్పుకొచ్చాడు. ‘సమంత చేయడం వల్ల ఆ పాట జనాల్లోకి వెళ్ళుండొచ్చు. కానీ ఆ ఒక్క పాట కోసమే థియేటర్ కు వెళ్లడం ఎందుకు వీడియో సాంగ్ చూసుకుంటే సరిపోతుంది కదా. భానుచందర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు’ అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus