‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పై సీనియర్ నటుడు శివకృష్ణ కామెంట్స్ వైరల్

వెంకటేష్ – రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూసేది కాదు.. సెపరేట్ గా చూడాలి’ అని చిత్ర బృందం ముందే వెల్లడించింది. కానీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఇమేజ్ ఉండడం… పైగా ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది కాబట్టి.. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ ను చూసే ప్రయత్నం చేసి.. తర్వాత నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఈ సిరీస్ నిండా శృంగారపు సన్నివేశాలు, పచ్చి బూతులు ఉంటాయి. డబుల్ మీనింగ్ డైలాగులకు అయితే ఇక హద్దు అదుపు లేదు.అందుకే ఈ సిరీస్ చూసిన ఇండస్ట్రీ సర్కిల్స్ కూడా తిట్టి పోస్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు శివ కృష్ణ ఈ సిరీస్ గురించి పరోక్షంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నిన్న నేను ఓ వెబ్ సిరీస్ చూడటానికి ప్రయత్నించి చూడలేకపోయాను. సడెన్ గా అలాంటి ఒక సీన్ వస్తుందని మనం ఊహించలేం కదా.

అంత దారుణాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు.అది చూసిన వెంటనే అసలు మనం ఎక్కడికి వెళ్లిపోతున్నాం అనిపించింది. దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం చాలా కష్టం. ఓటీటీ కంటెంట్ కు కూడా సెన్సార్ అవసరం. పిల్లలు ఓటీటీ కంటెంట్ వల్లనే పాడైపోతున్నారు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus