క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటిది కాదు. 1980ల కాలం నుండి ఉంది. అయితే ఇది ఒక్క సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ ఉంది. కానీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి.. సినిమా రంగంలోనే క్యాస్టింగ్ కౌచ్ అనే పేరుతో బాగా హైలెట్ అవుతుంది. అవకాశాల కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలని మాయమాటలు చెప్పి వశపరుచుకోవడం కొందరికి అలవాటు. ఈ సమస్య సీనియర్ హీరోయిన్లు కూడా ఫేస్ చేసినట్లు తెలుస్తుంది. ‘మీటూ’ ఉద్యమం దేశవ్యాప్తంగా పాపులర్ అయినా ఎవ్వరూ దీని గురించి నోరు విప్పింది లేదు.
అవకాశాలు లేక ఖాళీగా ఉన్న నటీమణులు తప్ప. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటి, హీరోయిన్ అయిన ఆమని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోకి నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డాను. ఆడిషన్స్ కోసం కోలీవుడ్లో కొన్ని కంపెనీలకు వెళ్లేదాన్ని. కొందరు సెలెక్ట్ చేసే వాళ్ళు మరికొంత మంది రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇదే క్రమంలో ఓ కంపెనీకి వెళ్తే.. .ఒక కంపెనీకి వెళ్తే.. చెప్పి పంపిస్తామని అనేవారు, నెక్స్ట్ డే ఫోన్ చేసి ‘బీచ్ కి వస్తారా’ అని అడిగేవారు.
ఇంకొంతమంది ‘మేనేజర్ ఫోన్ చేసి సార్ రమ్మంటున్నారు’ అని అడిగారు. సరే ‘మా అమ్మ కూడా వస్తాను పద అంటే.. ఆమె అవసరం లేదు మీరొక్కరే వస్తే చాలు’ అని అన్నారు. ఇలాంటివి డైరెక్ట్ గా అడగరు… ఇన్ డైరెక్ట్ గా అడిగేవారు. మొదట్లో నాకు ఇలా ఉంటుందని తెలీదు. ‘ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకోవాలి కదా, ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా కామన్’ అని మేనేజర్స్ చెబితే అప్పుడు అర్థమైంది. అలా అని ఇండస్ట్రీలో చెడ్డ వాళ్ళే కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు…
నా అదృష్టం కొద్దీ నేను మంచి వాళ్ళతోనే పని చేశాను.. చెడ్డ వాళ్ళ జోలికి పోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు ఆమని. నిజానికి ఈమె కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగులో ‘జంబలకిడి పంబ’ ‘శుభలగ్నం’ ‘మావిచిగురు’ వంటి తెలుగు సినిమాలతో స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం సహాయనటి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?