నటిగా, రాజకీయ నాయకురాలిగా తెలుగు నాట బాగా పేరుగాంచినవారిలో కవిత ఒకరు. పల్లెటూరు నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కథానాయికగా, సహాయ నటిగా మంచి పేరు సంపాదించుకున్నారామె. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అయితే ఆమె ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలా ఎందుకు మారింది అనే విషయాలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నటిగా మంచి పేరుతో అదరగొడుతున్న సమయంలో వందల కోట్ల ఆస్తి ఉన్న ఒక కోటీశ్వరుడిని వివాహం చేసుకున్నారు ఆమె. అయితే ఆ తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయట. దీంతో ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందటట. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కవిత.. కొన్ని కారణాల వల్ల 20 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక సినిమాలకు దూరమయ్యారు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరమయ్యారు కవిత.
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి సహాయ (Kavitha) నటిగా ఎంట్రీ ఇచ్చారు. తల్లి, వదిన పాత్రలు చేశారు. అయితే అంత ఆస్తి ఉన్న మీరు ఇలా ఏంటి అని అడిగితే… ‘‘మా వారికి వందల కోట్ల ఆస్తులు ఉన్న మాట వాస్తవమే. 11 దేశాల్లో ఆయనకు ఆయిల్ బిజినెస్‌లు ఉండేవి. ఏడేళ్ల క్రితం వ్యాపారంలో నష్టం రావడంతో సుమారు రూ.132 కోట్లు పోగొట్టుకున్నారు’’ అని అసలు విషయం చెప్పుకొచ్చారు. నష్టాలు రావడంతో చాలా వరకు ఆస్తులు అమ్మేశారు. దాంతోపాటు ఒత్తిడికి గురై 11 రోజులపాటు కోమాలో కూడా ఉన్నారు.
అదే సమయంలో కరోనా మా కుటుంబంలో చీకట్లు మిగిల్చింది. ఆ మహమ్మారి వల్ల నా భర్త, కుమారుడు చనిపోయారు. ముందు బాబు చనిపోయాడు. అక్కడికి పది రోజులకే మా ఆయన కన్నుమూశారు. ఆ బాధను తట్టుకోలేక చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అని చెప్పారు కవి. అయితే ఆ సమయంలో నా కూతుళ్లను చూసి ఆగిపోయాను అని చెప్పారు. కుటుంబంలో వచ్చిన కష్టాల నుండి బయటపడటం కోసమే మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాను. అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తా అని కవిత చెప్పారు.