నిర్మలమ్మ.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బామ్మ పాత్రలకు ఈమె కేర్ ఆఫ్ అడ్రస్. బామ్మ పాత్ర అంటే నిర్మలమ్మే ఉండాలి అంటూ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యేవారు. వారి డిమాండ్ మేరకు దర్శకనిర్మాతలు ఈమె డేట్స్ కోసం క్యూలో ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఈమె హీరోయిన్లతో సమానంగా పారితోషికం అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. హీరోయిన్లు అంటే పాటల టైంలో వస్తే సరిపోతుంది. కానీ బామ్మ పాత్ర చేసే నిర్మలమ్మ హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చేది.
అందుకే అప్పట్లో ఈమెకు అంత డిమాండ్. అయితే ఈమె అసలు పేరు నిర్మలమ్మ కాదు రాజమణి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన మహిళ ఈమె. చిన్నప్పటి నుండి ఈమెకు నాటకాలంటే ప్రాణం. అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి కారణమైంది. 1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది నిర్మలమ్మ . అయితే అటు తర్వాత ఈమెకు వెంటనే అవకాశాలు దక్కలేదు.
1961లో ‘కృష్ణప్రేమ’ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్రని దక్కించుకుంది నిర్మలమ్మ. ఆ సినిమా తర్వాతే ఈమెకు అవకాశాలు పెరిగాయి. సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించింది నిర్మలమ్మ. ఇదిలా ఉండగా.. ఈమె యుక్త వయసులో చాలా అందంగా ఉండేది. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!