‘ఏక్ థా దిల్ ఏక్ థీ దడ్కన్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్… ఆ తర్వాత ‘ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్’, ‘కంపెనీ’, ‘పింజర్’, ‘దిల్ కా రిష్తా’ వంటి పలు చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులో నాగార్జున- కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘చంద్రలేఖ’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వెంకటేష్ సరసన ‘ప్రేమతో రా’ సినిమాలో కూడా నటించింది.కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నిఖిల్- సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘కేశవ’ మూవీలో పోలీస్ ఆఫీసర్ షర్మిల మిశ్ర పాత్రని పోషించింది.
ఈమె పాత్రకి అనసూయ డబ్బింగ్ చెప్పడం జరిగింది. చివరగా ఈమె ‘దహనం’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇదిలా ఉండగా.. కెరీర్ ప్రారంభంలో ఈమెకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ను కూడా కోల్పోయిందట. ఆమె మాట్లాడుతూ.. ‘యాక్టర్స్‌గా ఎలా కనిపిస్తున్నాము? ఎలా నటిస్తున్నామనేదే ముఖ్యమని అప్పటి వరకు అనుకున్నాను. కానీ కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తర్వాత తెలుసుకున్నాను.
ఎవరి ప్రాధాన్యతలు వారికుంటాయి. నా వర్క్ కంటే జీవితము, వ్యక్తిత్వం ముఖ్యమైనవని నేను భవిస్తూ ఉంటాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకునేలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను. అలాంటి నాకు గతంలో ఆ ఓ నిర్మాత ఫోన్ చేసి ఓ హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారని చెప్పాడు.మొదట నాకర్థం కాలేదు.
తర్వాత హీరోకు ఫోన్ చేసి నీ స్టాఫ్ ఎవరూ లేకుండా ఒంటరిగా నావద్దకు రా అని చెప్పడంతో విషయం అర్థమైంది. అప్పుడు నిర్మాతను పిలిచి ‘నా అందం, పనితనం వల్లే ఇక్కడిదాకా వచ్చాను, ఇప్పుడు ఓ అవకాశం కోసం దిగజారిపోతానని ఎలా అనుకున్నారు’ అని కడిగిపారేశాను. దీంతో అతడు ఆ హీరో నిర్మాత ఆ సినిమా నుండీ తప్పించారు. అలా ఓ సినిమా అవకాశం మిస్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది ఇషా.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!