గ్రాండ్‌గా నటి సుమలత కొడుకు నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సినీ పరిశ్రమలో గతకొద్ది రోజులుగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి.. నాగ శౌర్య, హన్సిక వంటి స్టార్స్ పెళ్లిళ్లు చేసుకున్నారు.. రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ హరిప్రియ, వశిష్ట ఎన్. సింహా నిశ్చితార్థం జరగింది.. ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నారు.. సీనియర్ నటి సుమలత, కన్నడ ‘రెబల్ స్టార్’ దివంగత అంబరీష్ దంపతుల కుమారుడు.. యువ నటుడు అభిషేక్ అంబరీష్ ఎంగేజ్‌మెంట్ ప్రియురాలు అబివాతో డిసెంబర్ 11 (ఆదివారం) బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది..

శాండల్ వుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.. అంబరీష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ‘రాకింగ్ స్టార్’ యష్, తన భార్య రాధికతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో యష్, ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ హైలెట్‌గా నిలిచారు.. సుమలత మాండ్యా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు కూడా అభిషేక్ – అబివా నిశ్చితార్థానికి వచ్చి వారిని ఆశీర్వదించారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus