భారత దేశంలో ఎంతో ప్రాచుర్యం చెందిన వాటిలో లలిత కళల్ని ప్రధమంగా చెప్పుకోవాలి.మరీ ముఖ్యంగా కుచిపూడి ,భరతనాట్యం అంటే జనాలకి మక్కువ ఎక్కువ. అయితే భరత నాట్యన్ని మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పాపులర్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.అందులొ మధురిమ గారు కూడా ఒకరు.ఏకంగా ఆస్ట్రేలియ పార్లమెంట్ మెంబెర్స్ ..పిలిచి మరీ సేవా పురస్కారాన్ని అందించారు అంటే ఆమె గొప్పతనాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.విదేశాల్లో ఎన్నొ అవార్డులు రివార్డులు అందుకున్న మహిళగా కూడా ఈమె రికార్డు సృష్టించారు .
నాట్యకారిణిగా లేక్చరర్ గా ,ఒక నృత్యదర్శకురాలిగా ,అలాగే ఒక నటిమణిగా.. ఇలా అన్నిఅన్నిరంగాల్లోనూ రాణించారు. మంగళగిరిలో పుట్టిన మధురిమ గారు పెరిగిందంతా చెన్నైలోనే.అయినా సరే ఈమెను చూడంగానే తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తుంటారు. ‘సిరివెన్నెల’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన మధురిమ గారు ‘420’ చిత్రంతో హిరొయిన్ గా మరారు.సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ‘బొబ్బిలి దొర’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు మధురిమ.
అలాగే నందమురి బాలకృష్ణ హీరోగా నటించిన ‘బొబ్బిలి సింహం’ , ‘పెద్దన్నయ్య’ చిత్రాల్లో చెల్లెలి పాత్రలో కూడా నటించి ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకున్నారు. ‘ఒరేయ్ రిక్షా’ చిత్రంలో ‘నీ పాదం మీద పుట్టుమచనై చెల్లెమ్మో’ పాటతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే తర్వాత ఈమె సినిమాలకి బ్రేక్ ఇచ్చి… మనదేశ సాప్రదాయం అయిన నాట్యన్ని దేశ విదేశాలకు చాటి చెప్పలనే సదరు ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేశారు. అలా ఆమె అనుకున్న లక్ష్యం నేరవేర్చుకొని ‘శతమానం భవతి’ చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చినట్టే ఇచ్చి మాయమయ్యారు.
అయితే ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యశోద’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది.ఈ చిత్రంతో ఆమె మళ్ళీ నటనకు బ్రేక్ ఇస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో కూడా ఈమె నటిస్తుంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇక ‘యశోద’ ‘స్టాండప్ రాహుల్’ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!