నటి తులసి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.’డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల్లో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించింది తులసి. అటు తర్వాత ‘జులాయి’ ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. నిజానికి ఈమె బాలనటిగా ఎంట్రీ ఇచ్చిందన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘శంకరాభరణం’ లో మంజుల కూతురిగా, శంకర శాస్త్రి శిష్యురాలి పాత్రలో తులసి నటించింది.దాంతో పాటు ‘భార్య’ ‘జీవన తరంగాలు’ ‘న్యాయం కావాలి’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.
హీరోయిన్ గా కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాలేదు.1993 లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ‘కన్నయ్య కిట్టయ్య’ మూవీ తర్వాత ఈమె టాలీవుడ్లో కనిపించలేదు. వరుసగా కన్నడ సినిమాల్లో నటిస్తూ వచ్చింది.2010 లో ప్రభాస్ హీరోగా కరుణాకరణ దర్శకత్వంలో వచ్చిన ‘డార్లింగ్’ మూవీతో ఈమె టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈమె పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం గ్యారెంటీ.ఈమె తన 28వ ఏట కన్నడ డైరెక్టర్ శివమణిని వివాహం చేసుకుంది. ఒకే రోజులో అతన్ని చూడడం, ప్రేమించడం, సాయంత్రానికి పెళ్లి చేసుకోవడం జరిగిపోయిందట.
‘1995 లో ‘మదర్ ఇండియా’ మూవీలో నటించడానికి చెన్నై వెళ్ళాను. అప్పుడు కన్నడ దర్శకుడు శివమణితో పరిచయం ఏర్పడింది. శివమణిని షూటింగ్ లో చూసినప్పుడు నాకు ప్రేమ ఫీలింగ్ కలిగింది. అయితే పెళ్లి చేసుకుందాం అని అడిగింది మాత్రం నేను కాదు శివమణినే..! అదే నాకు ఆశ్చర్యం కలిగించింది. దాంతో ఆరోజు సాయంత్రమే గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ..పెళ్లి కేవలం ఒక్కరోజులోనే జరిగిపోవడం ఎప్పటికీ ఓ మెమొరబుల్ మూమెంట్. శివమణికి మొదట్లో సిగరెట్ అలవాటు ఎక్కువ ఉండేది. కానీ నాకు ఎలర్జీ అని తెలుసుకుని అతను సిగరెట్ కాల్చడం మానేశాడు’ అంటూ చెప్పుకొచ్చింది తులసి. ఈ దంపతులకు ఒక బాబు. అతని పేరు సాయి తరుణ్.