దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో సెట్స్ పై ఉన్న పలు తెలుగు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పోలిస్తే సీనియర్ స్టార్ హీరోలు బెటర్ అనే కామెంట్లు చేస్తున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటుంటే కొందరు స్టార్ హీరోలు మాత్రం రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయనుండగా గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు సైతం ఈ ఏడాదే విడుదల కానున్నాయి. చిరంజీవి ఈ ఏడాది కనీసం రెండు సినిమాలను విడుదల చేయడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య సైతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రెండు సినిమాలకు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. పలువురు దర్శకులు బాలయ్యకు కథలు చెబుతున్నారని మరికొన్ని రోజుల్లో బాలయ్య కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
యంగ్ జనరేషన్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు సక్సెస్ లేక కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ హీరోలు మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ సత్తా చాటుతున్నారు. నాగార్జున బ్రహ్మాస్త్ర, ఎఫ్3 సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. విక్టరీ వెంకటేష్ ఒకవైపు ఎఫ్3 సినిమాలో నటిస్తూనే మరోవైపు రానా నాయుడు అనే వెబ్ మూవీలో నటిస్తున్నారు. అయితే 150 కోట్ల మార్కెట్ ఉన్న యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు వేగంగా సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
యంగ్ జనరేషన్ హీరోలు సరైన ప్లానింగ్ తో సినిమాలను పూర్తి చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా ఈ సినిమాలు సమ్మర్ లోపు రిలీజ్ కానున్నాయి.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!