Naresh: నరేష్ ఆస్తుల విలువ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

చాలా సంవత్సరాల క్రితం హీరోగా ఒక వెలుగు వెలిగిన వాళ్లలో సీనియర్ నరేష్ ఒకరు. జంబలకిడిపంబ, మరికొన్ని సినిమాలు నటుడిగా సీనియర్ నరేష్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీనియర్ నరేష్ ఒక వెలుగు వెలిగారు. పలు బుల్లితెర సీరియళ్లలో నటించి నరేష్ సత్తా చాటారు. అటు కామెడీ రోల్స్ లో, ఇటు ఎమోషనల్ రోల్స్ లో అద్భుతంగా నటించి మెప్పించే ప్రతిభ నరేష్ సొంతమనే సంగతి తెలిసిందే.

సీనియర్ నరేష్ ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు అని సమాచారం. తల్లి విజయనిర్మల నుంచి వారసత్వంగా నరేష్ కు వచ్చిన ఆస్తుల విలువ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగింది. అదే సమయంలో నరేష్ సినిమాల ద్వారా భారీ మొత్తంలో సంపాదించడం గమనార్హం. ఈ ఆస్తుల వల్లే నరేష్ వివాదాల్లో చిక్కుకుంటున్నారని తెలుస్తోంది. నరేష్ కోరుతున్నా రమ్య రఘుపతి విడాకులకు అంగీకరించకపోవడానికి ఆస్తులే కారణమని సమాచారం. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో చాలా సంవత్సరాల క్రితం విజయనిర్మల స్థలాలు కొనుగోలు చేయగా వాటి విలువ ఊహించని స్థాయిలో పెరిగిందని బోగట్టా.

నరేష్ దగ్గర ఖరీదైన ఇళ్లు, ఖరీదైన కార్లు ఉన్నాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారవాన్ ను కలిగి ఉన్న అతికొద్ది మందిలో నరేష్ ఒకరు కావడం గమనార్హం. నరేష్ కు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. పాత్రలకు అనుగుణంగా లుక్ ను మార్చుకునే నటులలో నరేష్ కూడా ఒకరు. నరేష్ సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే ఆయనకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది.

నరేష్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరో, హీరోయిన్ల తండ్రి పాత్రలలో నటించి నరేష్ మెప్పించారు. నరేష్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తే ఒక్కో సినిమాకు 50 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus