ఎన్టీఆర్ తొలిసారిగా రావణ పాత్రను పోషించిన సినిమా భూకైలాస్. అలాగే ఇందులో నారదుడి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు నటించారు. భూకైలాస్ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయి. సెట్‌లో ఒకరి కంటే మరొకరు ముందు ఉండాలని వీరిద్దరూ పోటీ పడేవారు. అందరికంటే ముందు హీరోలు సెట్‌లో ఉండడంతో యూనిట్ సభ్యులు అలెర్ట్ అయ్యేవారు. ఈ సినిమాలో కీ రోల్ పోషించిన జమున కూడా వీలైనంత త్వరగా సెట్‌కి వచ్చేసేవారంట.
ఈ చిత్రంలో సూర్యోదయ సన్నివేశం ఒకటుంది. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్ పాల్గొనాలి. అందుకే చిత్ర దర్శకుడు కె. శంకర్ ముందు రోజు సాయంత్రం ఈ అగ్ర నటులిద్దరి దగ్గరకి వెళ్లి ‘రేపు ఉదయం సూర్యోదయ సన్నివేశాన్ని మీ ఇద్దరి మీద బీచ్‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశాం. మీరిద్దరూ ఉదయం ఐదు గంటల కల్లా స్పాట్‌లో ఉంటే ఒక గంట, గంటన్నర సమయంలో ఆ షాట్స్ తీసేసుకుని రావచ్చు’ అని చెప్పారు.
దీంతో హీరోలిద్దరూ సహజంగా ఉదయం పూట లేచే సమయానికంటే ముందు లేచి మేకప్‌తో సిద్ధమై ఐదు గంటలకల్లా బీచ్‌కు చేరుకున్నారు. అది చెన్నై బీచ్. కానీ ఆశ్చర్యం ఏంటంటే.. షూటింగ్‌కు సంబంధించిన వాళ్లు ఎవరూ లేరు. పొరపాటున వేరే ప్రదేశానికి వచ్చామా అని హీరోలిద్దరూ మొదట సందేహించినా తమకు చెప్పిన ప్రదేశం ఇదేనని నిర్ధారించుకున్నారు. సరే వస్తారు కదా అని ఆ బీచ్‌లో ఇసుక మీద కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఉదయం ఆరు దాటింది.
అయినా యూనిట్ సభ్యుల అలికిడి లేదు. ఎక్కడో తేడా జరిగి ఉంటుందనుకుని ఇక ఇంటికి వెళ్లడానికి ఎన్టీఆర్, ఏయన్నార్ సిద్ధమయ్యేసరికి దర్శకుడు శంకర్ అక్కడికి వచ్చారు. మేకప్‌తో సిద్దంగా ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లను చూడగానే ఆయన వణికిపోయారు. కారులోంచి ఒక్కసారిగా కిందకు దూకేసి వాళ్ల కాళ్ల మీద పడి పొరపాటైయింది. క్షమించమని బతిమాలాడారు. ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయినా.. అక్కినేని అనుగ్రహించారు. మొత్తంగా షూటింగ్ అయితే జరిగింది.. దీనికి ఫైన్‌గా ఎన్టీఆర్ రూ. 5000 వసూలు చేయడం అప్పట్లో చర్చగా మారిందంట!
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!