చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి సిగ్గుపడినా కూడా భారతదేశంలో 80% యువత యూట్యూబ్ లో ఉన్న కామెడీ లేదా నాలెడ్జ్ వీడియోల కంటే ఎక్కువగా సెక్స్ వీడియోలు చూస్తున్నారు. ఇక పోర్న్ సైట్స్ స్ట్రీమింగ్ వల్లే మొబైల్ కంపెనీలు డేటా ప్యాక్ ల పేరుతో తమ వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. సగటున ప్రతి గంటకి ఆరుకిపైగా రేపులు జరుగుతున్న మన భారతదేశంలో “సెక్స్/శృంగారం” గురించి మాట్లాడుకోవడానికి ఇప్పటికీ సిగ్గుపడతాం. కానీ.. నేటి యువతని గబుక్కున సుష్మా స్వరాజ్ ఏ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని అడిగితే తడబడతారేమో కానీ, మియా ఖలీఫా ఏ దేశస్తురాలు అని అడిగితే మాత్రం “పాకిస్తాన్” అంటూ నోరు చించుకొని చెప్పే పొజిషన్ లో ఉంది యువత.
ఒక్కోసారి హీరోయిన్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ కంటే పోర్న్ స్టార్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ పెద్దది అనిపిస్తుంది. రీసెంట్ గా సన్నీలియోన్ పూణే ఇన్సిడెంట్ అందుకు ఉదాహరణ. అయితే.. తెలుగమ్మాయి పూనమ్ కౌర్ కూడా ఈ విషయమై మాట్లాడుతూ “పోర్న్ స్టార్స్ బ్రతుకులే నయం” అంటూ ట్వీట్ చేసింది. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఆమెను మధ్యలోకి లాగడంతో ఆమె ఇలా స్పందించింది. అదే సందర్భంలో సగటు అమ్మాయిల్ని సమాజం చంపేస్తోంది అని పేర్కొనడం కూడా గమనార్హం.
మరి పూనమ్ వ్యాఖ్యలు ఎంతమంది పట్టించుకొన్నారో తెలియదు కానీ.. ఆమె అన్నది మాత్రం అక్షరాల నిజం.