సామాన్యుడికి సెంటిమెంట్ ఉండడం సహజమే. అయితే ఆ సెంటిమెంట్ అన్న పదం సినిమా ఇండస్ట్రీలో మరింత బలమైన పదంగా తీసుకోవాలి. సినిమా మొదలు కావడానికి, ఫర్స్ట్ లుక్ రిలీజ్ చెయ్యడానికి, ఆడియో వేడుకకి, ఇంకా చెప్పాలి అంటే విడుదలకి ఇలా ఒక్కో దానికి ముహూర్తం చూసుకుంటూ మన సినిమా వాళ్ళు ముందుకుపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా కాబట్టి విడుదల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వారికి కలసి వచ్చిన సమయంలోనే సినిమాను విడుదల చేస్తారు….ఆ విషయంలో చిన్న హీరో, పెద్ద హీరో, కొత్త దర్శకుడు, టాప్ దర్శకుడు అన్న డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇదిలా ఉంటే తాజాగా మన హీరోలు, దర్శకులు తమకు కలసి వచ్చిన సమయంలోనే సినిమాలు విడుదల చేస్తాం అని అంటున్నారు…ముందుగా మన జక్కన్న రాజమౌలినే తీసుకుంటే….జూలై నెలలోనే తన సినిమాలు విడుదల చేసేందుకు ఇష్ట పడుతున్నాడు…దానికి కారణం ఏంటి అంటే….ఆ నెలను తనకు కలిసొచ్చేదిగా భావిస్తాడట.
ఎందుకంటే మగధీర.. ఈగ.. మర్యాద రామన్నలతో పాటు బాహుబలి కూడా జూలైలోనే వచ్చి సంచలనాలు సృష్టించాయి కదా…అందుకని అట….ఇక మన న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ సెంటిమెంట్ ని నమ్ముతాడు అని తెలుస్తుంది…సెప్టెంబర్ మాసం అయితే తనకు కలసి వస్తుంది అని,తన కరియర్ లో టాప్ హిట్స్ గా నిలిచిన అష్టా చెమ్మా, భలేభలే మగాడివోయ్ చిత్రాలు సెప్టెంబర్ నెలలోనే వచ్చాయి అని అందుకే, ఇప్పుడు మజ్నుని కూడా వచ్చే నెలలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక మన స్టైలిష్ స్టార్ సైతం ఈ సెంటిమెంట్ కి ఏమాత్రం వేరు కాదు అంటున్నాడు…తన సినిమాలను ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నాడట…కారణం ఏంటి అంటే…రేసుగుర్రం.. సన్నాఫ్ సత్యమూర్తి.. సరైనోడు చిత్రాలు ఏప్రిల్ లో వచ్చి హిట్స్ కొట్టడమే అందుకే లేటెస్ట్ గా స్టార్ట్ అయిన దువ్వాడ జగన్నాథం కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చెయ్యనున్నట్లు సమాచారం. మొత్తానికి మన వాళ్ళ సెంటిమెంట్ బాగానే ఉంది.