సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ నెల చాలా వరకు బాక్సాఫీస్ దాహం తీర్చిందనే చెప్పాలి. ముందుగా అనుష్క ‘ఘాటి’, శివ కార్తికేయన్ ‘మదరాసి’ ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘ఘాటి’ ‘మదరాసి’ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. వాస్తవానికి వాటిపైనే మొదటి నుండి కొంత అంచనాలు ఉన్నాయి. కానీ ఊహించని విధంగా ఆ సినిమాలు చేతులెత్తేశాయి.

September Month Movies Results

చిన్న సినిమాగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ విజయ ఢంకా మోగించింది. ఈ సినిమా బయ్యర్స్ కి 4 రెట్లు లాభాలు అందించింది. ఇక తర్వాతి వారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కింధపురి’, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘మిరాయ్’ పెద్ద హిట్ అయ్యింది. ‘కిష్కింధపురి’ కూడా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.తర్వాతి వారం వచ్చిన ‘భద్రకాళి’ కూడా ఓకే అన్నట్టు ఆడింది.
ఇక అటు తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అలా సెప్టెంబర్ నెలకి మంచి ఫినిషింగ్ ఇచ్చినట్టు అయ్యింది. అలాగే సెప్టెంబర్ నెల నుండి ఫిలిం మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఓ లెసన్ కూడా నేర్చుకోవచ్చు. ‘లిటిల్ హార్ట్స్’ ‘మిరాయ్’ ‘కిష్కింధపురి’ వంటి సినిమాలు నార్మల్ టికెట్ రేట్లతోనే రిలీజ్ అయ్యాయి.
అవి ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేయడానికి అదే కారణం. మరోపక్క ‘ఓజి’ భారీ ఓపెనింగ్స్ వచ్చిన 2వ రోజు నుండి కలెక్షన్స్ తగ్గడానికి కూడా టికెట్ రేట్లే కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఇప్పుడు అందరి కళ్ళు అక్టోబర్ పై పడ్డాయి. ఈ నెల ముందుగా ‘కాంతార చాప్టర్ 1’ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక తర్వాత దీపావళి కానుకగా ‘K – RAMP’ ‘తెలుసు కదా’ ‘మిత్రమండలి’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇవి కూడా హిట్ అయితే అక్టోబర్ నెల కూడా టాలీవుడ్ కి కలిసొచ్చినట్టు అవుతుంది. ఇక ఈ నెల చివర్లో ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ అవుతుంది. ఇది కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

  
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus