మూడేళ్లు రిలీజ్ అవ్వలేకపోయిన సినిమాకి సీక్వెల్

హాలీవుడ్, బాలీవుడ్ లో బాగా అలవాటైన పని సీక్వెల్స్ తీయడం. హాలీవుడ్ లో హిట్ సినిమాలకు పోలోమని సీక్వెల్స్ వస్తుంటాయి. ఆ ఫార్మాట్ ను బాలీవుడ్ ఫ్లాప్ సినిమాల విషయంలోనూ పాటించిందనుకోండి. ఈ విధానాన్ని ఆచరిద్దామని ప్రయత్నించిన టాలీవుడ్ కి మాత్రం ఎందుకో పెద్దగా అచ్చిరాలేదు. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన సీక్వెల్ చిత్రాలు “మనీ మనీ మోర్ మనీ, గాయం 2, సత్య 2, శంకర్ దాదా జిందాబాద్, ఆర్య 2, మంత్ర 2,

సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, కిక్ 2, అవును 2, సింగం 3, విశ్వరూపం 2″ ఇలా సీక్వెల్స్ గా వచ్చిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడ్డాయి. మరి ఈ విషయాలను పెద్దగా పట్టించుకోలేదో లేక తన కంటెంట్ మీద ఉన్న నమ్మకామో తెలియదు కానీ.. “కృష్ణ అండ్ హిజ్ లీల” డైరెక్టర్ రవికాంత్ పేరేపు మాత్రం తన సినిమాకి సీక్వెల్ తీస్తానంటున్నాడు. రుక్సార్ & కృష్ణ నడుమ సీక్వెల్ స్టోరీ నడుస్తుందని చెబుతున్నాడు.

నిజానికి ఈ సినిమా మూడేళ్ళ క్రితం తీసినది. నిర్మాత సురేశ్ బాబుతో వచ్చిన స్పర్ధల కారణంగా ఇప్పటికీ ఆన్లైన్లో విడుదలైంది. మరి రవికాంత్ సీక్వెల్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది అనేది తెలియదు. పబ్లిసిటీ కోసం ఇలా అంటున్నాడో లేక నిజంగానే స్క్రిప్ట్ ఉందా అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus