తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ సెంటిమెంట్ల గోల ఎక్కువ. ఒకే విషయం పదే పదే రిపీట్ అవుతోంటే.. దాన్ని సెంటిమెంట్‌గా తీసుకోవడానికి ఏమాత్రం మొహమాట పడరు.. మనవాళ్లు. తెలుగు సినిమాల్లో సీక్వెల్స్ వర్కవుట్ అవ్వడం చాలా అరుదు. సీక్వెల్ సినిమాకి పనిచేసినప్పుడల్లా దేవిశ్రీ ప్రసాద్‌కి చేదు అనుభవమే ఎదురవుతోంది.
ఆర్య 2, శంకర్ దాదా జిందాబాద్‌లకు దేవినే సంగీత దర్శకుడు. ఆ రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు గబ్బర్‌సింగ్ సినిమాకి సీక్వెల్ లాంటి సర్దార్ గబ్బర్‌సింగ్‌కీ దేవినే సంగీత దర్శకుడు. ఇదీ ఫ్లాప్ అయ్యింది. ఇక మీదట సీక్వెల్ చిత్రాలకు దేవిశ్రీని సంగీత దర్శకుడ్ని పెట్టుకొందా మనుకొన్నవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారేమో..!