Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » 2022లో వస్తున్న సీక్వెల్స్‌ ఏంటో తెలుసా..!

2022లో వస్తున్న సీక్వెల్స్‌ ఏంటో తెలుసా..!

  • January 4, 2022 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2022లో వస్తున్న సీక్వెల్స్‌ ఏంటో తెలుసా..!

కొత్త సంవత్సరం వచ్చేసింది… మరి కొత్త సినిమాల సంగతి కూడా చూడాలి కదా. అందులో గతంలో మంచి విజయం అందుకున్న సినిమాల సీక్వెల్స్‌ వస్తున్నాయి అంటే ఆ వివరాలు తప్పకుండా చూడాల్సిందే. అలాంటి సినిమాల గురించే మీకిప్పుడు చెబుతున్నాం. గతంలో వచ్చిన హిట్‌ సినిమాలకు వస్తున్న కొనసాగింపు వివరాలు ఇవీ. అయితే ఇక్కడో మెలిక ఉంది. ఈ సినిమా రిలీజ్‌లు మాయదారి కరోనా సహకరిస్తేనే. మళ్లీ రూపం మార్చుకొని వచ్చిందంటే… ఇందులో చాలా సినిమాల తేదీలు, అవసరమైతే సంవత్సరాలు కూడా మారిపోతాయి.

* సీక్వెల్స్‌ గురించి మాట్లాడాలి అంటే తొలుత చెప్పుకోవాల్సింది ‘బంగార్రాజు’ గురించే. ఎందుకంటే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చేస్తున్నారు. నాగార్జున హీరోగా 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’కు ఇది కొనసాగింపు సినిమా. ఈసారి సోగ్గాళ్లు రాబోతున్నారు. నాగార్జున, నాగచైతన్య కలసి సందడి చేస్తున్నారు. సంక్రాంతి రిలీజ్‌ అన్నారు కానీ… డేట్‌ ఇంకా ఇవ్వలేదు.

* సీక్వెల్స్ గురించి మాట్లాడుకుంటే వచ్చే రెండో పేరు ‘కేజీఎఫ్‌’. నాలుగేళ్ల క్రితం ‘కేజీఎఫ్‌’ అంటూ ఓ సినిమాగా మొదలైన యశ్‌ – ప్రశాంత్‌ నీల్‌ ప్రభంజనం ఏకంగా ప్రళయంగా మారింది. ఆ సినిమాకు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. రెండో పార్టు ఇప్పటికే సిద్ధమైంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ పడుతూ ఈ ఏప్రిల్‌ 14కి తెచ్చారు. ఏమవుతుందో చూడాలి.

* మూడో సినిమా మాట్లాడుకుంటున్నాం కానీ… రీసెంట్‌ సినిమా అయితే ‘పుష్ప’నే. అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్‌’ ఎంత విజయం సాధించిందో మనకు తెలిసిందే. డిసెంబరులో విడుదలై 2021 బాక్సాఫీస్‌కి స్ట్రాంగ్‌ ఎండింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’గా తీసుకొస్తారు. రెండో పార్టును ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం అన్నారు. అయితే కరోనా ఏం చేస్తుందో.

* ఇప్పుడు ఫన్‌, ఫ్రస్టేషన్‌ గురించి మాట్లాడుకుందాం. ఆఁ.. అవును ‘ఎఫ్‌ 3’ గురించే చెబుతున్నాం. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ – అనిల్‌ రావిపూడి ట్రిపుల్‌ కాంబోలో వచ్చిన ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్ 2’కి ఇది కొనసాగింపు. మూడేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 25న రావాలి. అయితే కొన్ని సమీకరణాల వల్ల ఏప్రిల్‌ ఎండింగ్‌కి మూవ్‌ చేశారు.

* క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌, థ్రిల్లర్‌ తరహా సినిమాలు నచ్చేవాళ్లకు ‘హిట్‌’ సినిమా ఇచ్చిన కిక్‌ తెలిసే ఉంటుంది. రెండేళ్ల క్రితం విశ్వక్‌ సేన్‌ – శైలేష్‌ కొలను అందించిన సినిమా ఇది. ఇప్పుడు రెండో పార్టు అంటే ‘హిట్‌ 2’ను అడివి శేష్‌ హీరోగా తెరకెక్కించారు శైలేష్‌. రెండో ‘హిట్‌’ను ఫిబ్రవరిలో తీసుకొస్తున్నారు.

* నిఖిల్‌కు మంచి పేరు తీసుకొచ్చి, వసూళ్లూ తెచ్చి పెట్టిన సినిమా ‘కార్తికేయ’. దేవాలయం మిస్టరీ నేపథ్యంలో సాగిన ఈ సినిమాకు ఆ రోజుల్లో మంచి అప్లాజే వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని చాలా రోజులగా చెప్పినా… ఆఖరికి కరోనా ముందు ఓకే చేశారు. సినిమా చిత్రీకరణ అయితే కొనసాగుతోంది. జూన్‌ ఆఖరున సినిమా విడుదల చేస్తారని టాక్‌.

* అడివి శేష్‌కి సెమీ స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చిన చిత్రం ‘గూఢచారి’. యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ జోన్‌లో రూపొందిన ఈ సినిమాకు శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. ఈ సినిమాలో శేష్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌, నటన ఆకట్టుకున్నాయి. సినిమా ఆఖరున దీనికి సీక్వెల్‌ పక్కా అని చెప్పారు కూడా. చాలా రోజుల తర్వాత దాని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. సినిమా కూడా రెడీ చేస్తున్నారు. అయితే దీనికి రాహుల్‌ పాకాల దర్శకుడు.

* ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇప్పటికీ నవ్విస్తున్న చిత్రం ‘ఢీ’. మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా అది. దానికి సీక్వెల్‌ అని పేరు పెట్టకుండా ‘ఢీ అంటే ఢీ’ పేరుతో 2020 నవంబరులో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. అయితే ఇది సీక్వేలే అనేది ఓ టాక్‌. ఆ సినిమా మొదలైందా? ఎంతవరకు వచ్చింది అనేది తెలియదు. అయితే ఈ ఏడాదిలోనే వస్తుంది అని మాత్రం సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bangarraju
  • #Dhee 2
  • #Goodachari 2
  • #Karthikeya 2
  • #KGF2

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ సినిమా ప్లస్సులు మైనస్సులు

Akhanda 2: ‘అఖండ 2’ సినిమా ప్లస్సులు మైనస్సులు

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

related news

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ సినిమా ప్లస్సులు మైనస్సులు

Akhanda 2: ‘అఖండ 2’ సినిమా ప్లస్సులు మైనస్సులు

51 mins ago
Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

2 hours ago
Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

3 hours ago
Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

16 hours ago

latest news

Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

5 mins ago
Darshan: జైల్లో హీరో.. థియేటర్లలో ‘నో రివ్యూ’.. డెవిల్ పరిస్థితి ఏంటి?

Darshan: జైల్లో హీరో.. థియేటర్లలో ‘నో రివ్యూ’.. డెవిల్ పరిస్థితి ఏంటి?

21 hours ago
Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

21 hours ago
Actress Pragathi : లైవ్ లో ఏడ్చేసిన నటి ప్రగతి… ఇంతకీ ఏమైంది..?

Actress Pragathi : లైవ్ లో ఏడ్చేసిన నటి ప్రగతి… ఇంతకీ ఏమైంది..?

21 hours ago
Akhanda 2: బాలయ్య ముందు మిలియన్ డాలర్ల సవాల్.. అక్కడ గట్టెక్కేనా?

Akhanda 2: బాలయ్య ముందు మిలియన్ డాలర్ల సవాల్.. అక్కడ గట్టెక్కేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version