స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన గుణ శేఖర్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద నీలిమ గుణ నిర్మిస్తున్నారు.. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మించారు..
ఇప్పటివరకు విడుదల చేసిన ప్రోమోస్, సాంగ్స్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం (Shaakuntalam) ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె చిన్నారి అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమవుతోంది.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.. ఇక ఇటీవల సినిమా చూసిన సామ్ సక్సెస్ పట్ల ధీమాగా ఉంది..
జూబ్లీహిల్స్ పెద్దమగుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంది.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో భాగంగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు టీమ్.. ఇటీవల సమంత అలాగే గుణ శేఖర్, దిల్ రాజు చెప్పిన మాటలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి.. ‘యశోద’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సామ్ సినిమా ఇదే.. ఇక తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్త ఏంటంటే.. ‘శాకుంతలం’ మూవీకి భారీ బడ్జెట్ పెట్టారట..
అక్షరాలా రూ. 80 కోట్లతో రూపొందించారని.. ఇందులో సగం గుణ శేఖర్ (నీలిమ గుణ), మిగతా సగం దిల్ రాజు పెట్టుకున్నారని.. రాజు బిజినెస్ డీల్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు.. ఇది సౌత్‌లో ఇంత హై బడ్జెట్‌తో తీసిన వుమెన్ సెంట్రిక్ ఫిలిం.. కథ మీద నమ్మకంతోనే విజువల్ ఎఫెక్ట్స్‌కి కూడా భారీగా ఖర్చు చేశారని టాక్.. మరికొద్ది రోజుల్లో ‘శాకుంతలం’ తో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనుంది సామ్..