స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం `శాకుంతలం`. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్’ సమర్పణలో ‘గుణ టీమ్ వర్క్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవ్ మోహన్, మోహన్ బాబు,గౌతమి, అనన్య నాగళ్ళ.. వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.
ఏప్రిల్ 14 న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్లో ఏమో కానీ.. ఇటీవల ప్రీమియర్ షో వేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని వీక్షించిన వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓ రకంగా ప్రేక్షకుల రెస్పాన్స్ మిక్స్డ్ గా ఉందనే చెప్పాలి. కొంతమంది సినిమా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అని చెబుతున్నారు.
మరికొంతమంది అయితే సినిమా యావరేజ్, బోరింగ్ మూవీ అంటున్నారు. గుణశేఖర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టేకింగ్ విషయంలో అతను శ్రద్ద పెట్టలేదు అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది అని వేశారు కాబట్టి అక్కడ చూసుకోవచ్చు అని అంటున్నారు. సినిమాలో లెక్కలేనన్ని పాత్రలు ఉన్నప్పటికీ.. ఎవ్వరికీ కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు చెబుతున్నారు. దర్శకుడు గుణశేఖర్ కూడా ఈ విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పారు. సినిమాల్లో ఉన్న చాలా మంది పాత్రలు గెస్ట్ రోల్స్ లా ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది.
అయితే సమంత నటన, దేవ్ మోహన్ నటన, మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (Shaakuntalam) సినిమాకి హైలెట్ అని చెబుతున్నారు. కాస్ట్యూమ్స్ డిజైనర్స్ పనితనం కూడా బాగుందని ప్రత్యేకంగా చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని అంటున్నారు. సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు ఉందని అది కూడా సినిమాకి పాజిటివ్ పాయింట్ అని సినిమా చూసిన వారు కామెంట్లు పెడుతున్నారు.