వయసు పెరిగే కొద్దీ వేదాంతం మాట్లాడుతుంటారు అంటారు. దీనికి సినిమా జనాలు కూడా అతీతం ఏమీ కాదు. చాలా మంది నటులు ఇలా మాట్లాడటం చూసే ఉంటాం. అయితే ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్ మాట్లాడిన వేదాంతం ఇంకా చెప్పాలంటే జీవితంపై అంచనా చూస్తుంటే భలే అనిపించకమానదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు అలా ఉన్నాయి. జీవితం అంటే మంచి పీజాను తయారు చేయడం లాంటిది అంటున్నారాయన. వరుస అపజయాల క్లియర్‌గా చెప్పాలంటే భారీ డిజాస్టర్ల తర్వాత ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాలతో గతేడాది భారీ విజయాల్ని అందుకున్నాడు షారుఖ్ ఖాన్.
దీంతో ఆయన కెరీర్‌కు మాత్రమే కాకుండా మొత్తంగా బాలీవుడ్‌కే ఊపిరొచ్చింది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో షారుఖ్ మాట్లాడుతూ లైఫ్ అండ్ కెరీర్ గురించి మాట్లాడాడు. ఐదేళ్ల తర్వాత నేను ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఆ విరామం నాకు చాఆల పాఠాలు నేర్పింది అని చెప్పాడు షారుఖ్. ఈ సమయంలో వంట గదికి వెళ్లి పీజ్జాలు చేయడం నేర్చుకున్నాను అని చెప్పాడు. పర్‌ఫెక్ట్ పిజ్జా తయారు కావడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో జీవితం కూడా అంతే అని తెలుసుకున్నాను అని జీవితానికి, పీజ్జాకు లింక్ పెట్టి లైఫ్ లెసెన్ చెప్పాడు (Shah Rukh Khan) షారుఖ్.
ఆ సమయంలో తిరిగి సినిమాలు చేయమని తన ఫ్యామిలీ ప్రోత్సహించిందని, అప్పుడే ‘పఠాన్’, ‘జవాన్’ కథలు ఓకే చేశాను అని చెప్పాడు షారుఖ్. ఇండస్ట్రీలో శుక్ర, శని, ఆదివారాలు ముఖ్యం అంటుంటారని, కానీ తాను సోమవారాన్ని కూడా ముఖ్యమైన రోజుగానే చూస్తాను అని చెప్పారు. ఆ రోజే తాము కొత్త పని ప్రారంభిస్తాం అని నటుల పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేశారు.
తొలి మూడు రోజులు సినిమా ఫలితం గురించి ఆలోచిస్తామని, ఎలాంటి రిజల్ట్ వచ్చినా సోమవారం కొత్తగా స్టార్ట్ చేస్తామని చెప్పాడు షారుఖ్. అలా మరో 35 ఏళ్లు నటించడానికీ సిద్ధం అని చెప్పాడు. అంతేకాదు అన్ని భాషల్లో నటించాలనుందని, ఇంగ్లిష్‌లో కూడా నటిస్తానని చెప్పాడు. అయితే హాలీవుడ్ నుండి ఇప్పటివరకూ కథలు రాలేదని క్లారిటీ ఇచ్చాడు.