Jawan Movie: అట్లీ – షారుఖ్‌ సినిమా మీద కాపీ మరకలు!

అట్లీ తీసిన సినిమాలు చూసే తెలుగు అభిమానులకు.. అందులోని సీన్లు ఎక్కడో చూసినట్లుందే అనిపిస్తుంది. అట్లీ తీసిన యాక్షన్‌ మూవీస్‌ విషయంలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆయన సినిమా మొత్తంగా కాపీ అని మాత్రం ఎప్పుడూ కామెంట్లు రాలేదు. అయితే తొలిసారి అట్లీ మీద ఫుల్‌ సినిమా కాపీ అనే విమర్శలు వచ్చాయి. అది కూడా అతను తొలిసారి చేస్తున్న బాలీవుడ్‌ సినిమా మీద. షారుఖ్‌ ఖాన్‌తో అట్లీ తీస్తున్న ‘జవాన్‌’ మీద కాపీ మరకపడింది.

‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ లాంటి హిట్‌ సినిమాలతో అట్లీ కెరీర్‌ జోరున సాగుతోంది. విజయ్‌తో హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్న అట్లీ.. ఇప్పుడు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో వచ్చిన ‘పేరరసు’కు కాపీ అని ఆ సినిమా నిర్మాత మాణిక్యం నారాయణన్ తమిళనాడు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. ‘పేరరసు’ సినిమాను కాపీ కొట్టి అట్లీ ‘జవాన్’ సినిమా తెరకెక్కించారు అనేది ఆయన ఆరోపణ. 2006లో విజయ్‌ కాంత్‌ హీరోగా ఈ సినిమా వచ్చింది.

మరి ఈ విషయమై అట్లీ ఏమంటారో చూడాలి. ముందుగా చెప్పినట్లు అట్లీ సినిమాల్లో పాత సినిమాల వాసనలు కచ్చితంగా ఉంటాయి. ‘రాజా రాణి’ సినిమాలో తెలుగు ‘శ్రీమతి వెళ్లొస్తా’ వాసనలు కనిపిస్తాయి. ‘తెరి’ సినిమా ఫార్ములా ‘బాషా’ సినిమా నాటి నుండే ఉంది. ఇక ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాల్లోనూ పాత సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఇక ‘పేరరసు’లో విజయ్ కాంత్ డబుల్ రోల్ చేశాడు. అందులో ఒకరు పోలీస్ అయితే, మరో పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంది.

‘‘జవాన్‌’లో షారుఖ్ ఖాన్‌ డబుల్‌ రోల్‌ చేశాడు. ఒకరు పోలీస్, ఇంకొకరు టెర్రరిస్టు. పాత కథలను కాపీ కొట్టే అలవాటు అట్లీకి ముందు నుంచి ఉంది. ‘జవాన్’ సినిమా విషయంలో ఇదే జరిగి ఉండొచ్చు. అందుకే అతడిపై చర్యలు తీసుకోవాలి’’ అని నిర్మాత మాణిక్యం కోరారని తెలుస్తోంది. అయితే సినిమా ఇంకా ఎవరూ చూడకుండా ఇలాంటి విమర్శలు రావడం గమనార్హం.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus