షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జవాన్ మూవీ ఈ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. పలు మల్టీప్లెక్స్ లలో జవాన్ మూవీ టికెట్ రేట్లు కళ్లు చెదిరే విధంగా ఉన్నాయి.
బెంగళూరులోని డైరెక్టర్స్ కట్ థియేటర్ లో జవాన్ టికెట్ ధర ఏకంగా 2400 రూపాయలు ఉండటం గమనార్హం. ఈ రేంజ్ లో టికెట్ రేట్లు ఉన్నా బుకింగ్స్ అదుర్స్ అనే రేంజ్ లో ఉండటం గమనార్హం. జవాన్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జవాన్ రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
అట్లీ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అందరికీ నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా జవాన్ మూవీ నిరాశపరిచే ఛాన్స్ లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జవాన్ మూవీ నిడివి కూడా ఒకింత ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
దీపికా పదుకొనే ఈ సినిమాలో నటించడంతో బాలీవుడ్ వర్గాలు సైతం ఈ సినిమా కలెక్షన్లు అంచనాలకు మించి ఉండనున్నాయని భావిస్తున్నాయి. 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఆకాశమే హద్దుగా జవాన్ మూవీపై (Jawan Movie) అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!