షాహిద్ కపూర్ సంచలన కామెంట్లు తెగ హడావిడి చేస్తున్నాయి..!

టాలీవుడ్ గేమ్ చేంజర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ను బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా సందీప్ రెడ్డి వంగా నే డైరెక్ట్ చేస్తున్నాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా షాహిద్ కపూర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన కొన్ని ప్రశ్నలకి ఆసక్తికరమైన జవాబులిచ్చాడు షాహిద్. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మిడిల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. షాహిద్ కపూర్ కి హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ అంటే చాలా అభిమానం. గతంలో కూడా పలు మార్లు ఆమె గురించి మాట్లాడి తన అభిమానం చాటుకున్నాడు షాహిద్. ఇప్పుడు కూడా ఓ విలేకరు ”మీకు మిస్టర్ ఇండియా మాదిరిగా మాయం అయ్యే పవర్ వస్తే ఎవరు స్నానం చేస్తుండగా చూడాలనుకుంటున్నారంటూ” ప్రశ్నించగా.. అప్పుడు షాహిద్..’ఆ ఛాన్స్ వస్తే తప్పకుండా స్కార్లెట్ జాన్సన్ స్నానం చేస్తున్నపుడు చూస్తా. అంతే కాదు.. స్కార్లెట్ జాన్సన్ పెళ్ళి నా వల్ల క్యాన్సిల్ అయిందనే పుకార్లు వస్తే నేను బాగా ఎంజాయ్ చేస్తాను.ఆమె అంటే నాకు అంత ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus