శంభో శంకర ప్రమోషన్స్ కోసం శంకర్ ఇలా చేస్తున్నాడా

తన శ్రీకాకుళం యాసతో తొలుత “జబర్దస్త్” షోలో నవ్వుల పువ్వులు పూయించిన శంకర్ అలియాస్ షకలక శంకర్ ఆ తర్వాత సినిమాల్లోనూ తనదైన శైలి కామెడీతో వెండితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు. “రాజుగారి గది, ఆనందో బ్రహ్మ” వంటి సినిమాలకైతే షకలక శంకర్ కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాంతో ఇప్పుడు మనోడు కామెడీ షోలు, రోల్స్ పక్కన పెట్టేసి ఏకంగా హీరోగా ప్రయత్నించాలని ఫిక్స్ అయిపోయాడు. క్రేజ్ కూడా ఉండడంతో వెంటవెంటనే “డ్రైవర్ రాముడు, శంభో శంకర” అనే రెండు సినిమాలు కూడా మొదలయ్యాయి. వాటిలో “శంభో శంకర” ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో శంకర్ కామెడీ క్రియేట్ చేయాలనుకొన్నాడో లేక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామనుకొన్నాడో తెలియదు కానీ.. మనోడి మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

“శంభో శంకర” కథ పట్టుకొని శంకర్ & టీం చాలా మంది నిర్మాతలు, దర్శకులు, హీరోల దగ్గరకు వెళ్లారట. అందరూ తర్వాత చేద్దాం అన్నవాళ్లే తప్ప ఎవరూ పట్టించుకోలేదట. ముఖ్యంగా త్రివిక్రమ్, దిల్ రాజులు అయితే రెండేళ్ల తర్వాత చూద్దాం అన్నారు. ఇక మా రవితేజ గార్ని అడిగితే “నన్ను నేను ఓ 20 ఏళ్ల క్రిందట చూసినట్లు ఉంది” అన్నారు. ఎవరూ వెనక్కి లాగలేదు కానీ.. ముందుకు వెళ్లడానికి కూడా దోహదపడలేదు అంటూ తన బాధను కూడా సరదాగా నవ్వుతూ పంచుకొన్నాడు శంకర్. అయితే.. ఈ కామెంట్స్ లో సీరియస్ గా తీసుకొనే పని లేదు కానీ.. కొందరు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఇంకొందరేమో సినిమా ప్రమోషన్స్ కోసమే శంకర్ ఇలా అన్నాడని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus