డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న ‘కేడీ నెం-1’!!

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం`1’. జాని దర్శకత్వంలో డి.గిరీష్‌ బాబు నిర్మిస్తున్నారు. ఖుషీ గడ్వీ, గుర్లిన్‌ చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన డిసెంబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్‌ బాబు మాట్లాడుతూ..‘‘ `శంభో శంక‌ర‌` చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా జాని దర్శకత్వంలో ‘కేడీ నెం`1’ అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. దర్శకుడు జాని అద్భుతంగా తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిలిం. టీమ్ అంద‌రి స‌హ‌కారంతో సినిమాను అనుకున్న విధంగా రూపొందించ‌గ‌లిగాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు జానీ మాట్లాడుతూ…“కే.వి.వి. స‌త్యనారాయ‌ణ‌గారు, వార‌బ్బాయి వేణుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. డైర‌క్ట‌ర్ గా ఇది తొలి సినిమా. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంక‌ర్ కు నా ధ‌న్య‌వాదాలు. శంక‌ర్ కామెడీ మాత్ర‌మే కాదు యాక్ష‌న్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యార‌క్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా శంక‌ర్ అద్భుతంగా చేశాడు “ అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus