Mahesh Babu: మహేష్ తో సిగ్నేచర్ మూమెంట్స్ చేయించానంటున్న శేఖర్ మాస్టర్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదల కాబోతుంది. ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే ఈ చిత్రం నుండీ విడుదలైన టీజర్, పాటలు,థియేట్రికల్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

అలాగే సినిమా పై అంచనాలు కూడా పెంచాయి. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ‘సర్కారు వారి పాట’ కి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో కళావతి, పెన్నీ,అలాగే ఓ మాస్ సాంగ్ కి నేను కొరియోగ్రఫీ అందించడం జరిగింది. కళావతి, పెన్నీ సాంగ్స్ ఆల్రెడీ సక్సెస్ సాధించాయి. త్వరలో విడుదల కాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్.

ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ కనిపిస్తాయి. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి.ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యునిక్ స్టెప్స్ ఉంటే.. దాని పై సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా వస్తాయి.. కళావతి పెన్నీ సాంగ్స్ పై చాలా మంది రీల్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. అందులో కూడా యునీక్ స్టెప్స్ ఉంటాయి.మహేష్ బాబు గారితో ఇది నా రెండో సినిమా.

మొదట ‘సరిలేరు నీకెవ్వరు’.. అందులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్ చేశాను అలాగే ‘సర్కారు వారి పాటలో’ 3 సాంగ్స్ చేశాను.మహేష్ బాబు గారు దేన్నైనా త్వరగా నేర్చుకుంటారు. ఆయనలో అద్భుతమైన రిధమ్ ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని కంపోజ్ చేస్తే మంచి డ్యాన్స్ రాబట్టవచ్చు.మహేష్ బాబు చాలా అందంగా ఉంటారు. అలాంటి అందగాడు డ్యాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ మహేష్ అభిమానులకి ఆ ముచ్చట తీరుతుంది” అంటూ చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus