షాలినీ పాండే సరికొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?

  • June 20, 2019 / 06:19 PM IST

వైజయంతి మూవీస్ అధినేత మరియు స్టార్ ప్రొడ్యూసర్ అయిన అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్.. ‘స్వప్న సినిమా’ బ్యానర్ ను స్థాపించి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి హిట్ చిత్రాలని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఓ కథా బలం ఉన్న సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ‘పిట్టగోడ’ ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందనుంది. యంగ్ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేం నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోలుగా నటించబోతున్నారట.

ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండేని ఎంచుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి… కాస్త ఫేం ఉన్న ‘షాలినీ పాండే’ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. పాత్ర ప్రకారం.. ఈ చిత్రంలో షాలిని ఓ న్యాయవాదిగా కనిపించబోతుందట. సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. స్వప్నదత్ ‘మహానటి’ లో కూడా కీలక పాత్ర పోషించింది షాలిని.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus