రజనీకాంత్ సినిమా రిలీజ్ కి ముందే కమల్ హాసన్ సినిమా.!
- March 22, 2018 / 11:55 AM ISTByFilmy Focus
అసలు శంకర్ ఒక సినిమా మొదలెట్టాడంటే ఆల్మోస్ట్ ఒక యాగం చేస్తున్నట్టే. తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఒక సినిమా చేస్తుండగా మరో సినిమా అంగీకరించని లేదా మొదలుపెట్టని శంకర్.. మొట్టమొదటిసారిగా కమల్ హాసన్ (Kamal Haasan) కోసం తన సరికొత్త సినిమా “రోబో 2.0” రిలీజ్ కి ముందే కమల్ హాసన్ సినిమా మొదలెట్టనున్నాడు. కమల్ హాసన్ తొందరపెట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇటీవలే పోలిటికల్ పార్టీ ఏర్పాటు చేసి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్న కమల్ హాసన్ “ఇండియన్ 2″ని పోలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించమని శంకర్ ని కోరాడట. ఈమేరకు శంకర్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలెట్టాడట. సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు, ప్రతినాయకుడిగా ఎవరు కమల్ ని ఢీకొనబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన విషయంగా మారింది.
ఇకపోతే.. శంకర్ “రోబో 2” విడుదల అనుకొన్నదానికంటే ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉండడంతో శంకర్ “ఇండియన్ 2” ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఒక సినిమా చేస్తున్నందుకు ఆనందించాలో, లేక ఇదే కమల్ హాసన్ ఆఖరి సినిమా అని బాధపడాలో అర్ధం కాక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారు కమల్ హాసన్ అభిమానులు.












