శంకర్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సర్కారోడు, అధికారి అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ రెండు టైటిల్స్ కు నెటిజన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ రాలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సిటిజన్ అనే టైటిల్ జోరుగా వినిపిస్తోంది.
దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అజిత్ హీరోగా ఇదే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సిటిజన్ అనే టైటిల్ అన్ని భాషలకు సూట్ అవుతుంది. ఈ టైటిల్ విషయంలో ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాకు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. శంకర్ చరణ్ కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది.
చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించిన చరణ్ కియారా ఈ సినిమా కోసం మరోసారి కలిసి నటిస్తుండటం గమనార్హం. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే టీజర్ లేదా ట్రైలర్ రిలీజైతే మాత్రం ఈ సినిమా కథకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. చరణ్ గత సినిమా ఆచార్య డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న నేపథ్యంలో తర్వాత సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని చరణ్ భావిస్తున్నారు.