Bigg Boss 5 Telugu: షణ్ముక్ యాక్టింగ్ కి ఎవరికి కాలుతోంది..?

బిగ్ బాస్ హౌస్ లో అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి అనే స్కిట్ చాలా ఎంటర్ టైనింగ్ గా నడిచింది. ఇందులో భాగంగా రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పెళ్లికొడుకు తల్లి అయిన ప్రియ నెక్లెస్ ని దొంగిలించాలని, అలా దొంగలిస్తే మీరు నేరుగా కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పాడు. దీంతో సీక్రెట్ టాస్క్ ని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు రవి. చాలా ఈజీగా నగల డబ్బాని కొట్టేశాడు. ప్రియ తన నగల డబ్బా కోసం ఇల్లంతా వెతికింది. షణ్ముక్ సిరి విషయంలో బాగా హర్ట్ అయ్యాడు. ముఖ్యంగా నాగార్జున క్లాస్ పీకిన తర్వాత ఖచ్చితంగా రియలైజేషన్ వచ్చింది. అందుకే జెస్సీతో సిరి గురించి మాట్లాడాడు. బెడ్ మార్చుకోవాలని చెప్పాడు.

దీని తర్వాతే అసలు కథ మొదలైంది. జెస్సీ వేరే హౌస్ మేట్స్ తనకి పెర్ఫామ్ చేసే స్కోప్ ఇవ్వడం లేదని, సన్నీ ఇంకా కాజల్ దగ్గరకి వచ్చి మొరపెట్టుకున్నాడు. ఇక్కడే కాజల్ ఎవరి క్రియేటివిటీ వాళ్లది, అందరూ ఆర్టిస్టులే కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఇదే విషయాన్ని జెస్సీతో షణ్ముక్ కూడా చెప్పాడు. అక్కడ కూర్చుని బాబూ..బాబూ.. యాక్టింగ్ అని అర్ధమైపోతోంది ఓవర్ యాక్టింగ్ చేయకు అంటూ మాట్లాడాడని చెప్తున్నాడు. ఆడెవడు నాకు చెప్పడానికి, వాళ్లిద్దరూ పెద్ద యాక్టర్లా..? ఆడెవడు నామీద కామెంట్స్ వేయడానికి నేను ఎందుకు పట్టించుకుంటాను. అది సపోజ్ జనాలు చూస్తే వాళ్లకే తెలుస్తుంది.

వాడికే దెబ్బ..నీకు అర్ధమవుతోందా అని చెప్తూ.. వాళ్లకి లిటరల్లీ కాలుతోంది అని చెప్పాడు. ఇక్కడే మనకి రవి క్లోజ్ వేశాడు. అక్కడ రవి ని ఉద్దేశ్యించి షణ్ముక్ మాట్లాడాడా లేదా వేరే వాళ్లని ఉద్దేశ్యించి మాట్లాడాడా అనేది క్లారిటీ లేదు. వాళ్లకి కాలుతోందని, ఎవరైనా పెర్ఫామ్ చేస్తుంటే వాళ్లకి స్కోప్ లేదు కాబట్టి కాలుతోందని జెస్సీతో క్లియర్ గా చెప్పాడు షణ్ముక్. వాళ్లు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తే వాళ్లకే లాస్. జస్ట్ మనం దండం పెట్టి స్మాల్ ఇస్తే వాళ్లకే కాలుతుంది. ఇంకా రెచ్చిపోతారు అంటూ షణ్ముక్ జెస్సీకి సలహా కూడా ఇచ్చాడు. ఎవడికైనా కూడా ఎంత కాలితే అంత మంచిది అంటూ జెస్సీకి హితబోధ చేశాడు షన్నూ.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus