Shanmukh: ఏజెంట్ ఆనంద్ సంతోష్ గా రాబోతున్న షన్ను?

కరోనా సమయంలో థియేటర్ లు మూతపడటంతో ఓటీటీ సంస్థలకు మంచి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, సినిమాలు అంటూ ప్రేక్షకులను సందడి చేయడానికి ఆహా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఆహా మరొక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్నో వెబ్ సిరీస్ లతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ జస్వంత్ అనంతరం బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లారు. ఈ కార్యక్రమం మొదట్లో షణ్ముఖ్ జస్వంత్ విన్నర్ అవుతారని భావించారు అయితే చివరికి ఈయన రన్నర్ గా నిలబడ్డారు. బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం షణ్ముఖ్ జస్వంత్ మునుపటిలా యాక్టివ్ గా లేరు. ఇప్పటివరకు ఈయన నుంచి ఏ విధమైనటువంటి సినిమాలకు సంబంధించిన

అప్డేట్స్ లేదా వెబ్ సిరీస్ లకు సంబంధించిన అప్డేట్స్ రాలేదని అభిమానులు నిరుత్సాహంలో ఉన్న సమయంలో ఈయన సరికొత్త వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ అరుణ్ పవర్ దశకత్వంలో షణ్ముఖ్ జస్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ ను ఆహా ప్రసారం చేయనుంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆహా అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో షణ్ముఖ్ జస్వంత్ సూట్ కేస్ చేతిలో పట్టుకొని ఉండగా.. దానిపై కేస్ క్లోజ్డ్ అని కనిపిస్తుంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus