Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ గేమ్ ప్లాన్ ఇదేనా..?

బిగ్ బాస్ హౌస్ లో ఐదోవారం నామినేషన్స్ లోకి వచ్చిన షణ్ముక్ గేమ్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గేమ్ స్టార్ట్స్ అంటూ తన గేమ్ స్ట్రాటజీలని చూపిస్తున్నాడు. ముఖ్యంగా జెస్సీ, సిరిలతో కలిసి కార్నర్ బ్యాచ్ అనే పేరు సంపాదించాడు. గత నాలుగు వారాలుగా హౌస్ మేట్స్ తో అంతగా కలవని షణ్ముక్ ఇప్పుడు నామినేషన్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా గేమ్ గేర్ మార్చాడు. అంతేకాదు, ఒకేసారి హౌస్ లో 8మంది తనని నామినేట్ చేయడం అనేది కూడా షణ్ముక్ కి బాగా కలిసొచ్చింది. ఆట ఎలా ఉన్నా బయట ఫాలోయింగ్ లో మనోడు కింగ్. అందుకే, ఓటింగ్ లో రాకెట్ లాగా దూసుకుపోతున్నాడు.

అయితే, ఐదోవారమే ఇలా ఓటింగ్ జరిగితే, మిగతా హౌస్ మేట్స్ మాటేంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే, బిగ్ బాస్ ఎక్కడో అక్కడ షణ్ముక్ ని ఖచ్చితంగా లాక్ చేస్తారని అంటున్నారు. ఇక శ్రీరామ్ చంద్రని టార్గెట్ చేస్తూ తన కెప్టెన్సీ ని సైతం సవాల్ విసిరాడు. జెస్సీతో అన్నమాటలు నాకు నచ్చలేదంటూ శ్రీరామ్ తో వాదనికి దిగాడు. అంతేకాదు, ఆరోజు రాత్రి అంతా ఫుడ్ కూడా తినలేదు. సిరి జెస్సీ షణ్ముక్ ముగ్గురూ నిరాహారదీక్ష చేశారు. దీంతో కెప్టెన్ అయినందుకు శ్రీరామ్ కూడా తినకుండా మానేశాడు. తెల్లారి అంతా సద్దుమణిగింది అనుకున్న టైమ్ లో బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు అంటూ టాస్క్ ఇచ్చాడు.

ఇక్కడే శ్రీరామ్ రవి కి సపోర్ట్ చేస్తే, షణ్ముక్ సన్నీకి సపోర్ట్ చేశారు. చాలాసార్లు నోరుజారి మరీ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతున్నాడు. దీంతో అతనికి హౌస్ లో రెడ్ కార్డ్ ఇస్తారా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే, సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముక్ ఆటలో ఎగ్రెసివ్ గా ఉంటే పర్లేదు కానీ, అసలు గేమ్ ఆడకుండా క్రిటిసైజ్ చేస్తూ పబ్బం గడిపేస్తుంటే అతడు విన్నర్ అవ్వడం అనేది బిగ్ బాస్ లవర్స్ కి నచ్చడం లేదు. ఒకవేళ తన ప్రవర్తన ఇలాగే ఉంటే తోటి హౌస్ మేట్స్ తో నామినేట్ చేయించి మరీ ఎలిమినేషన్ కి పంపించేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

లేదా, రెడ్ కార్డ్ ద్వారా ప్రేక్షకులు వేసే ఓట్లతో పనిలేకుండా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని నేరుగా ఎలిమినేట్ చేస్తారా అని కూడా అనిపిస్తోంది. ఏది ఏమైనా నాలుగు వారాల పాటు సైలెంట్ గా ఉన్న షణ్ముక్ ఇప్పుడు గేమ్ లో టాస్క్ కంటే కూడా హౌస్ మేట్స్ ని టార్గెట్ చేయడం పైనే దృష్టిపెట్టాడు. అతడి ఆట ఇలాగే ఉంటే అసలు అతనికి ఓట్లు ఎవరు వేస్తున్నారు అనేది బిగ్ బాస్ లవర్స్ కి అంతుచిక్కడం లేదు. అదీ మేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus